పారిజాతం (కోరల్ జాస్మిన్) ఔషధ గుణాలు : -- పారిజాతం ఆకులు దళసరిగా గరుకుగా ఉంటాయి. నాలుగు పారిజాతం ఆకులను తెచ్చి కడిగి ముక్కలుగా త్రుంచి కొన్ని అల్లం ముక్కలు తాటి బెల్లం వేసి నీరు పోసి మరిగించి చల్లార్చిన కాషాయం తాగితే దగ్గు, కఫం, జలుబు, చికెన్ గున్యా జ్వరం , డెంగ్యూ జ్వరం కూడా తాగ్గి పోతుంది. దీని కాషాయం తాగితే ప్లేటిలెట్స్ (రక్త పట్టికలు ) రక్తం లో కౌంట్ పెరుగుతుంది. ఈ కషాయంలో జిలకర కూడా వేసి తాగితే మోకాళ్ళ నొప్పులు , నడుం నొప్పి, వాపులు తగ్గిపోతాయి. పారిజాతం ఆకులు కషాయంలో తేనే కలిపి చిన్న పిల్లలకు తాగిస్తే అన్ని రకాల క్రిములు మలం ద్వారా బయటకు వెళ్లి పోతాయి పొట్ట శుద్ధి అవుతుంది.. - పి . కమలాకర్ రావు


కామెంట్‌లు