ది లాస్ట్ హగ్(కామెడీ లేని కథ):అది 2061వ సంవత్సరం.నరేష్ తల్లి కాలం చేసి, రెండు నెలలయింది.భార్య స్వీటీ,అత్తగారి బట్టలు వగైరాలను ఎవరికైనా ఇచ్చేద్దామని,ఆవిడ బీరువా తెరిచి అన్నీ బయటికి తీస్తూ ఉంటే బట్టల మధ్య నున్న ఒకపాత కాలపు ప్లాస్టిక్ డిబ్బీ బయట పడింది.ఇదేమిటో చూడండి అంటూ తెచ్చి భర్త చేతికిచ్చింది స్వీటీ. అది చూసిన వెంటనే నరేష్ ఒక అద్భుతమైన అనుభూతికి లోనయ్యాడు.ఆ డిబ్బీని తన కోసం తండ్రి, మొదటిసారి బేంక్ ఎకౌంటు తెరిచినప్పుడు,ఆ బేంకు వారు ఇచ్చారు.అప్పుడు తను మూడవ తరగతి చదువుతున్నాడు.తనకు పదిహేను,పదహారు సంవత్సరాలు వచ్చేవరకు తనకు తండ్రి ఇచ్చే పోకెట్ మనీలో మిగిలిన డబ్బును అందులో వెయ్యడం,ప్రతి సంవత్సరం,తన పుట్టినరోజు నాడు ఆ డబ్బు లెక్క పెట్టి బేంక్ ఎకౌంటులో జమ చెయ్యడం కళ్లకు కట్టినట్లు గుర్తు వస్తోంది.అలా పొదుపు చేసిన డబ్బుతో తండ్రి తనకు సైకిల్ కొనడం గుర్తు వచ్చింది.గభాలున లేచి ఆ డిబ్బీని రెండు చేతులతో అందుకొని, అక్కడే కూలబడి దాని కింది భాగంలో ఉన్న నెంబర్లను చకచకా నొక్కాడు.ఆ పాస్ వర్డ్ తన పుట్టినరోజు నంబరే అని, తనకింకా గుర్తే.ఆ డిబ్బీ కింది భాగంలో నుంచి భళ్లున తెరుచుకొని ఘల్లు ఘల్లు మంటూ కొన్ని నాణాలు,రకరకాల నోట్లు కింద పడ్డాయి.గబ గబా అవన్నీ స్వీటీతో కలిసి పోగు పెట్టాడు.విచిత్రంగా అందులో డబ్బుతో బాటు రెండు కాగితాలు కూడా ఉన్నాయి.ఒకదాని మీద ఏవో లెక్కలు ఉన్నాయి.రెండవది తన తల్లి చేతి వ్రాత తో ఉన్న ఒక ఉత్తరంఅతను స్వీటీని,"కళ్లజోడు ఇలా పట్రా "అంటూ,అంతవరకూ ఆగలేక ఆ ఉత్తరాన్ని చదవాలని ప్రయత్నిస్తున్నాడు."బాబూ" అనే మాట తప్ప ఏం కనిపించడం లేదు.అలాగే కూర్చుని తల్లిదండ్రుల జ్ఞాపకాల ఒడిలోకి జారిపోయాడు. అప్పుడు తను ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.అందరి లాగే చదువు సాగిస్తూనే లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవడం,పార్టీలు,మోటార్ సైకిళ్ళు అన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడు ప్రపంచాన్నంతా మృత్యు ఘంటికల కరాళ నృత్యం తో వణికించిన కరోనా మహమ్మారి విజృంభించింది.ఇప్పుడంటే భారతదేశం అభివృద్ధి చెందింది కానీ ఆ సమయంలో భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో నే ఉండేది.ఆ సమయంలో ప్రపంచాధిపత్యం వహిస్తున్న ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు సైతం తమ దేశ ప్రజల మరణాలను ఆపలేక అల్లాడి పోయాయి.అప్పట్లో ఆ వైరస్ కు చికిత్స లేదు.మనిషి నుంచి మనిషికి దావానలంలా వ్యాపించి ప్రపంచాన్ని చుట్టబెట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.ఆ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు తమ తమ పరిధిలో శక్త్యానుసారం ఆ వైరస్ వ్యాప్తిని అడ్డుకొనే ప్రయత్నాలలో భాగంగా రకరకాల ఆంక్షలు విధించాయి.ప్రతీ దేశమూ విధించిన ఆంక్షలలో మొదటిది ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలనీ సామాజిక సంపర్కాన్ని తగ్గించాలనీ,ముఖ్యంగా విదేశాలనుంచి వచ్చిన వారు పధ్నాలుగు రోజులు ఇంటికే పరిమితం అవ్వాలనీ,కానీ ఆ సమయంలో చాలా దేశాల్లో ప్రజలెవరూ ముంచుకొస్తున్న ముప్పును గ్రహించక ప్రభుత్వ ఆంక్షలను పట్టించుకోలేదు.ముఖ్యంగా భారత దేశంలో తన లాంటి యువత కుటుంబ సభ్యుల విన్నపాలనూ, ప్రభుత్వ ఆంక్షలను పెడ చెవిన పెట్టారు.ఎవరెంత చెప్పినా యువతలో రోగనిరోధక శక్తి ఎక్కువ కనుక తమకు అది రాదనీ,వచ్చినా అప్పట్లో డాక్టర్ లు జ్వరానికి విరివిగా వాడే పారసిటమాల్ వాడితే తగ్గిపోతుందనీ,పరిశుభ్రత పాటిస్తూ,ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ వంటి డిసిన్ఫెక్టెంటెంట్ చల్లుకుంటే చాలనీ,తాము ముఖానికి రుమాలు కట్టుకుంటున్నారు కనుక,తాము మోటార్ సైకిల్ నడుపుతుంటే తమకు దగ్గరగా మనిషి ఎవరుంటారనీ,ఇలా ఎన్నో కారణాలు చెప్పి వితండ వాదం చెయ్యడమే తప్ప ఎవరూ ఆ ఆంక్షలను పట్టించుకోలేదు.తర్వాత కొన్ని వారాల్లోనే చాలామంది దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది.ఆంక్షలు విధించిన మెదట్లో తను, ఒకరోజు అసలు బయట ఎలా ఉందో తెలుసుకోవాలని ఉత్సుకత తోనూ,మరో రోజు ఎలెక్ట్రిక్ రేజర్ లో బేటరీలయి పోయాయనీ,తమ ఫ్రెండ్స్ అంతా నిర్వహిస్తున్న కరోనా అవగాహనా కార్యక్రమంలో పాల్గొనాలనీ,ఇంట్లో బోర్ అయి పోతున్నాను ఐదు నిమిషాలలో వచ్చేస్తాననీ,ఇలాంటి అర్థంలేని కారణాలతో బయటికి వెళ్లి గంటలు గంటలు మోటార్ సైకిల్ మీద తిరిగి వచ్చేవాడు.మూడో రోజూ అలాగే తిరిగి వచ్చినప్పుడు తల్లి,"ఎంత చెప్పినా నువ్వు ఎలాగూ తిరగడం మానడం లేదు.నీ చేత కాస్త కరివేపాకు తెప్పించుకో వలసింది,కూరలయిపోయి అయిపోయి మూడు రోజులయింది", అనడంతో,"నాలుగు రోజుల నుంచి పప్పు పులుసు,ఆవకాయ తినలేక చస్తున్నాను,నేను బంగాళా దుంపలు,కరివేపాకు తెస్తాను", అంటూ, మరోసారి బయటకు వెళ్లవచ్చు అనే ఉద్దేశంతో,తన తండ్రి వద్దని ఎంత వారించినా, వినకుండా వెళ్లి పోయాడు.అదే సమయంలో తన ఫ్రెండ్ ,వాళ్ల అన్నయ్య విదేశాలనుంచి వచ్చాడనీ తమ ఇంట్లో నే ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తున్నాడనీ ఒక గంటలో వెళిపోవచ్చనీ పిలిచాడు.తాను ఆ వైరస్ మాట ఎత్తడంతో,"మా అన్నయ్య కేమీ లేదు,ఎయిర్ పోర్టు లోనే టెస్ట్ చేశారు, రిపోర్టు నెగెటివ్",అని అనడంతో,ధైర్యంగా వెళ్లి రెండు గంటలు వాళ్లింట్లో గడిపి వచ్చాడు.వచ్చేటప్పుడు మధ్యలో ఆపిన పోలీసులతో తాను చేసిన వాదన శృతి మించడంతో ఒక లాఠీ దెబ్బ కూడా రుచి చూశాడు.అప్పుడు అనుకున్నాడు ఇంక రేపటినుంచి బయటికి ఎక్కువ తిరగడం మానేద్దామని.ఇంటికొచ్చి పోలీసుల విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా పడుకున్నాడు. ఆ తర్వాతి రోజు ఉదయం తను ఇంకా నిద్ర లేవలేదు.తన తండ్రి తనను,"నాన్నా,నాన్నా,ఇంక లే,అప్పుడే పదయింది, లేవాలి మరి.అమ్మా,నేను ఒకసారి అలా డాక్టర్ దగ్గరకు వెళ్ళి వస్తాం,ఏమిటో ఒళ్లంతా నొప్పులు గా ఉంది,గొంతు కూడా నెప్పి గా ఉంది,అసలే బయట పరిస్థితి బాగోలేదు,ఒకసారి చూపించు కొంటే మంచిది కదా",అంటూ తనను నిద్ర లేపాడు.వెళ్లేముందు తనను ఒకసారి గాఢంగా కౌగిలించుకుని,"బైరా!,తలుపేసుకో,ఒక గంటలో వచ్చేస్తాం", అంటూ బయల్దేరారు.అప్పుడు నాన్న నాలుగైదు రోజుల నుంచి ఇంట్లో కూర్చుని టీవీ చూసి చూసి ఏం చేస్తున్నాడో తెలియటం లేదు.సినిమా వాళ్లలా ఈ కావలించుకోడం ఏమిటో అనుకుంటూ వెటకారంగా నవ్వుకున్నాడు.ముందు రోజు తిన్న లాఠీ దెబ్బ వల్ల ఒళ్లు నొప్పులతో ఆరోజంతా లేవలేక పోయాడు.హాస్పిటల్ కు వెళ్లిన అమ్మా,నాన్న సాయంత్రం వరకు ఇంటికి రాకపోయినా,ఏమీ పట్టించుకోక,తనకు జరగ వలసిన నష్టం అప్పటికే ప్రారంభం అయి పోయిందని గ్రహించలేక పోయాడు.అలా వెళ్లిన తండ్రి కొన్ని వారాల వరకూ రకరకాల ఆసుపత్రుల్లో కరోనా వైరస్ తో పోరాడి పోరాడి ఓడిపోయాడు.అంతే తర్వాత తండ్రిని చివరి చూపు కూడా చూడలేక పోయాడు.కొడుకుగా తాను చెయ్య వలసినది కూడా చేసే పరిస్థితి లేదు.తల్లికి కూడా ఆ వైరస్ సోకినా కోలుకొని,ప్రాణం ఉన్నా జీవం లేనట్లుగా జంటగా వెళ్లి ఒంటరిగా ఇంటికి వచ్చింది.ఆరోజు నుంచి తల్లి చూపును కళ్లెత్తి చూసి, ఎదుర్కొనే శక్తి తనలో కలగ లేదు.ఊరిలో ఉన్న బంధువులకు తెలియజేసినా ఎవరూ వచ్చి, ఏమీ చేయగలిగే పరిస్థితి లేదు.పైగా తండ్రి ఆ వైరస్ వల్ల మరణించాడని తెలిశాక బంధువులంతా తమకు క్రమ క్రమంగా దూరమయి పోయారు.సంసారం వీధిన పడడంతో తండ్రి పోయిన రెండు నెలలకే,తల్లి చుట్టుపక్కల ఉద్యోగస్తుల పిల్లలను,వారు ఆఫీసుకి వెళ్లినపుడు,చూస్తూ తనను పోషించవలసి వచ్చిందతన చదువైతే కొనసాగలేదు.ఒక సంవత్సరం తరువాత జీవితంతో రాజీపడి,అతి కష్టం మీద ,ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఆఫీస్ బోయ్ గా చేరి,కొన్నాళ్లకు క్లర్క్ గా మారాడు.తాను బాధ్యతా రాహిత్యంతో కొన్ని రోజులు ఇంట్లో ఉండలేక, వీధులు పట్టుకు తిరగడంతో,తన తల్లితో సహితంగా వీధిన పడ్డాడు. అప్పటినుండి తన భవిష్యత్తు కోసం బంగారు బాటలు పరిచిన తండ్రి ప్రాణం పోవడానికి ఒక రకంగా తానే కారణం అనే బాధ తనను చిత్రవధ చేస్తూనే ఉంది'అనుకుంటూ కళ్లు మూసుకున్న నరేష్ ని, "ఇదుగో కళ్లజోడు,ఏమాలోచిస్తున్నారు?",అంటూ వచ్చిన స్వీటీ ఈలోకంలోకి తెచ్చింది. ***** ఒక్క ఉదుటున ఆ కళ్లజోడు అందుకున్న నరేష్ ఉత్తరం చదవడం మొదలు పెట్టాడు.కొన్ని సంవత్సరాల క్రితం వ్రాసినట్లు తారీకును బట్టి తెలుస్తున్న ఆ ఉత్తరం,బాబూ,నరేష్,మీ నాన్నగారు ఏ పరిస్థితుల్లో మనని వదలి పెట్టారో,దానికి కారణం ఎవరో నీకు తెలుసు. నువ్వు నా కడుపున పుట్టావనే ఒక్క కారణంతోనే నిన్ను,నీకు రెక్కలొచ్చే వరకూ పోషించాను,తప్ప నేను నిన్ను క్షమించి మాత్రం కాదు. నువ్వు చేసిన నిర్లక్ష్యపు తప్పుని,నన్ను చివరి వరకూ పోషించి కడిగేసుకుందాం అనుకుంటావేమో.నేను నీకా అవకాశం ఇవ్వను. అందుకే నా పోషణార్థం నువ్వు పెట్టిన ఖర్చు మొత్తం లెక్కగట్టి ప్రతీ నెలా నీ డిబ్బీలోనే వేస్తున్నాను.చీటీలో సంవత్సరానికొకసారి జమ చూపించాను.ఇన్ని సంవత్సరాల నుంచి జమ అయిన మొత్తం డిబ్బీ నిండిన ప్పుడల్లా బేంకులో జమ చేస్తున్నాను.ఆ పాస్ బుక్ ….",అంటూ, అక్షరాలు వెంట పరుగెడుతున్న అతని కళ్లు చెమ్మగిల్లి మసకబారుతుంటే,తన తల్లి,తండ్రి మరణం నుంచీ ఇప్పటి వరకూ కరివేపాకుని ఎందుకు నోట పెట్టలేదో అర్థం అవుతుండగా,తల్లి ఒడి చల్లదనం,తండ్రి చివరి సారిగా కౌగలించుకున్నప్పటి వెచ్చదనం, రెండు ఒకేసారి గుర్తు కొస్తుండగా,ఆ డిబ్బీని మరింతగా గుండెలకు హత్తుకుంటూ,పక్కకి ఒరిగి పోతున్నాడు,నరేష్.. (కథను ఇలా ముగించినందుకు భావుకులు మన్నించాలి.బాధ్యతా రాహిత్యానికి ముగింపు ఇలాగే ఉండవచ్చని చెప్పడమే నా ఉద్దేశ్యం. డా.గురవారెడ్డి గారు చెప్పినట్లుగా,ఏ ఒక్కరు మారినా మరో కొంతమందికి ఈ వైరస్ సంక్రమించే ప్రమాదం తప్పించినట్లు అవుతుందనే నా ఈ ప్రయత్నంOn Mon, Feb 17, 2020, 2:55 PM manideep doll show <rajitha.meeseva@gmail.com> wrote:ఒకసారి ఒక పేదవాడు బుద్ధుడి వద్దకు వచ్చాడు. అతను బుద్ధుడిని ఇలా అడిగాడు‘అయ్యా! నేను ఎందుకు పేదవాడిగా పుట్టాను? నేనే ఎందుకిలా పుట్టాలి? నేనెందుకు పేదవాడను?’.బుద్ధుడు అతనికి శాంతంగా ఇలా సమాధానం చెప్పాడు.‘మీరు ఎందుకు పేదవారు అంటే మీరు ఎటు వంటి ఔదార్యం కలిగి లేరు. మీ జీవితంలో దాన ధర్మాలు చేసి ఎరుగరు. అందుకే ఇలా పేదవాడిగా పుట్టారు’. ‘నిజమే! నేను దాన ధర్మాలు చేయలేదు. కానీ, చేయడానికి నా వద్ద ఏమున్నది? నేను ఏమైనా కలిగి ఉంటే కదా.. ఇతరులకు దానం చేయ గలుగుతాను?’ అని ఆ పేదవాడు బుద్ధుడిని ప్రశ్నిం చాడు.నిజమే. మీరేమీ కలిగి లేరని మీరు భావిం చడం నిజమే. కానీ, మీరు ఇతరులతో పంచుకో గల ఐదు నిధులను మీలో కలిగి ఉన్నారు. అయినా వాటిని గుర్తించక మీకు మీరు పేదవాడిగా భావిస్తూ బతుకీడుస్తున్నారు’ అని బుద్ధుడు ఆ పేద వాడికి బదులిచ్చాడు.‘అయితే అవేమిటో నాకు చెప్పండి. తెలుసు కుంటాను’ అని పేదవాడు తిరిగి అడిగాడు.అప్పుడు బుద్ధుడు ఆ పేదవాడికి వివరంగా ఇలా చెప్పడం ప్రారంభించాడు. మొదట మీ ముఖం ఉంది. మీరు ఇతరులతో మీ ఆనందాలను (నవ్వులను) పంచుకోవచ్చు. అది ఉచితం. మీ ముఖంపై చిరునవ్వు ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుందనే విషయం మీకు తెలుసా?. రెండవది- మీ కళ్లు. వాటి సాయంతో మీరు ప్రేమ మరియు శ్రద్ధతో ఇతరులను చూడవచ్చు. ఇది నిజం. మీరు లక్షలాది మందిని మీ కళ్లతో ప్రభావితం చేయవచ్చు. వాటితో మంచి మధుర అనుభూతిని పొందవచ్చు. మూడవది- మీ నోరు. మీకు ఉన్న ఆ నోటితో ఇతరులకు మంచి విషయాలు బోధించవచ్చు. మంచి విషయాలు పంచుకోవచ్చు. మంచి విషయాల గురించి చర్చించవచ్చు. నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు, ప్రతి మాట విలువైనదిగా భావించి, ఆ నోటిని పొదుపుగా వాడాలి. అది ఇతరులను ఆనందింప చేసే మాటలనే మాట్లా డాలి. తద్వారా ఆనందం, సానుకూలత, మంచి తనం అనేవి అందరిలో వ్యాప్తి చెందుతాయి. నాలుగవది- మీ గుండె. మీకు గుండె ఉంది కదా! దాని నిండా ప్రేమను నింపుకోండి. అప్పుడు అది దయ గల హృదయం అవుతుంది. మీ ప్రేమ గల హృదయంతో మీరు ఇతరుల శ్రేయస్సును కోరుకోవచ్చు. ఇతరులయొక్క ఆనందాన్ని కోరుకో వచ్చు. ‘ఎల్లప్పుడు నాకు, నా చుట్టూ ఉన్న ఇతరులకు మంచి కలగాలి’ అని ఆకాంక్షించవచ్చు. ఇతరుల భావోద్వేగాలను మీ హృదయంతో ఆస్వా దించి మీరూ అనుభూతి చెందవచ్చు. ఇతరుల జీవితాలను ప్రేమ కలిగిన మీ హృదయంతో తాకితే అది వారి జీవితాల్లో ఎంతో మార్పును తెస్తుంది. ఆ విధంగా మీ దయ హృదయంతో ఇతరుల జీవితాలను తాకవచ్చు......... అని బుద్దుడు ఆ పేదవాడికి చెబుతూ వచ్చాడు. అర్థమయిందా ఫ్రెండ్స్, ప్రపంచంలో అందరూ దనవంతులే. ..... ఒక్క హృదయం లేనివారు తప్ప.... మీ. జి. మణిదీప్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం జూనియర్ కళాశాల జడ్చర్ల


కామెంట్‌లు