కరోనా శత పద్యాలు (ఆటవెలది): ఉండ్రాల రాజేశం : 41) ఒకటి రెండు మూడు యింతింత పెరుగుతూ భయము చూపుతుంది భారతాన బందు యెంతవున్న బయటి దేశాలొల్ల గుట్టు విప్పుతుండె బెట్టుగాను 42) బయట దేశమంటు వచ్చి తెలంగాణ చిక్కుకున్న వారి చిట్టవిప్పి కదలకుండ చేసి క్వారెంటెయిన్ నందు వుంచినారు బాగు వుత్తమముగ 43) రెండు రోజులన కరీంనగరమునందు కదిలినట్టి వ్యాధి కంటపడగ ఇల్లు యిల్లు తిరిగి యిండోనెషియనులు ముప్పు తెచ్చిననిరి ముదముగాను 44) పోరుగడ్డ వణికి పోవుతుండ గదరా పాప మెరుగనట్టి ప్రజలమంటు ముప్పు జూసి వగసి ముంగిలి దాటక కష్ట పడుతువుండ్రి యిష్టముగను 45) దేశమంత కదిలి పాశానము నొదిలి యముడు చంపుతుండు యడ్డులేక మొదట తగ్గుముఖము మురియ ఘడియ కాలె ముచ్చటించ వ్యాధి ముసురుతుంది 46) ముఖ్యమంత్రి కదిలి ముఖ్యుల పిలిపించి కట్టు దిట్టమనెను కఠినముగను గీత గీసినట్టి కెసిఆర్ పిలుపునకు రాష్ట్రమంత కదిలె రయమునను 47) రామచంద్రుడైన రాజేందర్ మంత్రిగా అంటు వ్యాధి వదల వెంటనడిచె సాయ మడగకున్న సయ్యనా కెటిఆర్ యే ఆజ్ఞ వేయుచుండు నాచరించి 48) గల్లి గల్లి తిరిగి పల్లె పట్నము చేరి శుద్ది చేయ తలచి బుద్దిచేప్పి తాను ముందు నడిచి తన్నీరు హరిషుండు కంటనీరు బాపె కార్యమందు 49) బాధ తొలగెనంటు బాధ్యతలందుండి మైకులందు నిలిచి మాటలాడి కొద్ది రోజులందు పెద్దగా విజయంబు పొందినాము యనిరి పొగుడుకుంట 50) పరుగు పెట్టి కదిలి మర్కజ్ కలయికతో ఉల్కి పడ్డదంత పలుకులేక వేలమంది నిలిచి విడిదిగా వుండిరి వ్యాధి వ్యాప్తి చెంద వగచినారు


కామెంట్‌లు