శతక పద్య రచన పూర్తి కరోనా శతక పద్యాలు (ఆటవెలది)- ఉండ్రాల రాజేశం 81) ఎర్రగడ్డలోన యెర్రి వేషాలతో మందు బాబులంత మంచిగైరి మధ్యపానమున్న మహినంత అల్లర్లు మానివున్న చాలు మంచిదనిరి 82) దొంగతనము లేదు దుర్మార్గములు లేవు యాక్సిడెంటు లేక నదుపునుంది నేర చరిత రాక కారా గృహంబులు ముక్కు నేలువేసి మురిసినాది 83) ప్రకృతి కుదురుకుంటు పర్యావరణమంత స్వచ్ఛ గాలి వీచి శ్వాస నింపి కదలలేని రోడ్డు కాలుష్య కోరలు ముగిసి పోయినాయి ముచ్చటగను 84) చినుకుపడ్డ నేల చిత్తడై కదులుతూ మట్టి వాసనంత మదిన చేరి పల్లె పట్నమందు పరిమళత్వము నింపి పసిడి ధరణి విలువ పలకరించె 85) అమెరికా అడిగిన హైడ్రాక్సి క్లోరొక్వీన్ భారతాంబ నిండ పంపినాది సకల దేశములకు సంజీవనంటునూ పొగుడుతుండ్రి మనల పుడమినందు 86) చైననందు జనులు చకచక తిరుగుతూ రోడ్లపైన వుండ్రి రోగమిడిచి మందు మాకులేదు మాతాడ యంటిరి అంటు వ్యాధి యెట్ల యణచనోయి 87) లాకు డౌను తేది లాస్ట్ ఎఫ్రియల్ నని ముఖ్యమంత్రులంత ముచ్చటించి ప్రతినిథులను పిలిచి ప్రశ్నించిన ప్రధాని దేశమంత మాట బేషుయనిరి 88) కఠిన నియమమెట్టి కన్పడితే కేస్ లు పెడుతముంటు చెప్పి పెంచినారు బాధలెన్నియున్న బతుకుట మేలని పబ్బతట్టి నిలిచె ప్రజలు యింట 89) పెండ్లిలన్ని రద్దు పేరాంటములు పోక చావుకాడ యెవరు జనము లేరు ఆపదేదివున్న ఐనవారే రారు ఇంటికాడ వుండ యిష్టపడిరి 90) లక్ష దాటుతుంది శిక్షగా జగతిన వ్యాధి బారినొంది ప్రాణమొదిలి భయము భయము వుంది బయటి దేశాలలో భారతాన మనకు భయములేదు 91) వంద రోజులైన వదలని మహ్మారి పదిన లక్షలంటు వ్యాధి జేరి పిలిచి పిలిచి వచ్చి పిడుగోలె పట్టింది వదులు రోజు యెపుడు బదులులేక 92) దేశ సేవ జేసి తిరిగొచ్చి పోలీసు భార్య బిడ్డలకును దూరముండి తిన్న తీరు చూడు కన్నీరు వచ్చును దండమయ్య నీకు దైర్యశీలి 93) కాళికాంబలాగ కదిలి కరోనాను శూలమట్టి చంపు శూరులుండి వైద్య వృత్తినందు భారత వైద్యులు సాటిరారు మీకు మేటిగాను 94) వెంటిలేటరందు వెళ్ళకుండా చావు తీసుకెళ్ళుతుంది తీర్పుజేప్పి ఎండ లెక్కువున్న యిండియా ధరణిన వ్యాధి చావుననిరి ప్రముఖులంత 95) కేబినెట్ ను పిలిచి కెసిఆర్ యె చర్చించి బయట పడుట కొరకు భాద్యతిచ్చి లాభ నష్టమైన లాక్ డౌన్ ను పెంచుతూ భయము వలదుయందు ప్రజలననియె 96) జాతి జనుల కొరకు జాగృతంబున మోడి మాటలాడినాడు మనసువిప్పి శక్తినంత వొడ్డి సమరము చేద్దాము గెలుపు మనది యంటు తెలిపినాడు 97) వంద కోట్లపైన ప్రజలున్న దేశాన వ్యాధి యెక్కువైన వ్యాప్తిచెందు ఆపతరము గాదు యనిగి ఉండుట మేలు ఇంటి పట్టునుండు తుంటరయ్య 98) కోట్ల రాసులున్న కూటి కొరకు వారు స్వంత పనులు జేసి సర్థుకుంటు యోగ విద్య నేర్చి యారోగ్య పెంపుకై పోజు లెట్టుతుండ్రి పోటిపడుతు 99) కవులు కలము తోని కవితలెన్నో రాసి చదువుతుండ్రి వారు సకలముగను చక్కనైన రచన చైతన్య భీజమై కదిలినారు కవులు కదనమందు 100) దేహమున్న నాడు దేశాన రక్షనై అడ్డు నిలిచినావు యవనినందు నీవు లేనినాడు నింగి నేలున్నను కాంచువాడు యెవరు కలియుగాన


కామెంట్‌లు