ప్రపంచం కరోనా గుప్పిట్లో చివురుటాకులా రెప రెప లాడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి .. అయినా చాలా మందికి ఈ తీవ్రత అర్థం కావడం లేదు.. లాక్ డౌన్ మనకు శిక్ష కాదు. ఇదే మనకు రక్ష. మరి కొందరు ఎందుకు పాటించడం లేదు.. నిర్లక్ష్యంగా వున్నందుకు ఇటలీ, ఇంగ్లాండ్, అమెరికా, జెర్మనీ దేశాలు ప్రాణాలను ఫణంగా పెట్టవలసి వస్తుంది.. మరి మన దేశం లో ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడానికి ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలి. ఏ ఒక్కరు కూడ బయటకు రాకండి. యెంత చెప్పినా వినిపించుకోకుండా. ఏదో సాకు చెబుతూ బయట తిరుగుతున్నారు.. ఇది చాలా ప్రమాదం. ఇలా చేస్తే ఇబ్బంది ఒక్కరికే కాదు.. మొత్తం సమాజం పడవలసి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు విచక్షణతో ఉండాలి. మీకు అన్ని తెలుసు కావచ్చు. ఏమీ కాదన్న ధీమా మీలో ఉండొచ్చు. కానీ పరిస్థితి మన చేసిలో లేదు. అందరు త్వరగా విపత్తు నుంచి బయట పడాలంటే ప్రతి ఒక్కరు సహకరించాలి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ. ప్రపంచాన్ని కాపాడాలనుంటే మీరు ఇంట్లోనే ఉండాలి. తప్పదు.. ఇది శిక్ష కాదు, మీ ఓపికకు పరీక్ష. . తస్మాత్ జాగ్రత్త. -టి. వేదాంత సూరి.


కామెంట్‌లు