సుమతీ శతకం ౩౪వ పద్యం. కోమలి విశ్వాసంబును బాములతోఁ జెలిమి యన్య భామల వలపున్ వేముల తియ్యఁదనంబును భూమీశుల నమ్మికలుసు బొంకుర సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .... స్త్రీలు చూపించే విశ్వాసం చేత, విషపూరితమైన జీవుల యందు ప్రేమజేత, పరస్త్రీ లందు వ్యామోహం చేత, వేప పువ్వులలో ఆకులలో తియ్యదనం ఉంటుంది అనే భ్రమ చేత, రాజులు యజమానులు మనయందు నమ్మకంతో ఉంటారు అనే భావన చేత, మనం మన మనస్థైర్యాన్ని, మన మీద మనకు వున్న నమ్మకాన్ని వదులు కోకూడదు. ఎందుకంటే, ఇక్కడ చెప్పబడినవి అన్నీ కూడా నమ్మశక్యం కానివి కనుక........... ....అని సుమతీ శతకకారుని వాక్కు. ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు