సుమతీ శతకం ౨౨వ పద్యం. కరణము గరణము నమ్మిన మరణాంతకమౌను గాని మనలేడు సుమీ కరణము తన సరి కరణము మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ ... ఒక కరణము/లేఖకుడు (అకౌంటెంట్) మరొక లేఖకుని నమ్మి పని చేస్తే మరణ సమానమైన ఆపదను కొని తెచ్చుకున్నట్లే. అందుచేత, లేఖకుడు తనతో సమానమైన తెలివితేటలు గల ఇంకొక లేఖకునికి తన వృత్తి సూష్మాలు (ట్రేడ్ సీక్రెట్స్) చెప్పక ఎంతో జాగరూకతతో తన లేఖన వృత్తి సాగించుకోవాలి...... ....అని సుమతీ శతకకారుని వాక్కు. ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు