సుమతీ శతకం ౨౬వ పద్యం. కాదు సుమీ దుస్సంగతి పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్ వాదుసుమీ యప్పిచ్చుట లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .. చెడ్డవారితో/దర్మార్గులతో స్నేహం మంచిది కాదు. వంశంలో ఒక్క వ్యక్తి చేసిన మంచి పనులవల్ల ఆ వంశానికి వచ్చిన కీర్తి కలకాలం నిలిచి ఉంటుంది. ఆ వ్యక్తి మరణించినా వచ్చిన కీర్తి తగ్గిపోదు/నశించదు. అప్పు ఇచ్చినా పుచ్చుకున్నా తగవులు వచ్చే అవకాశం ఎప్పుడూ వుంటుంది. కుల సతులు కాని స్త్రీల వద్ద ప్రేమ, ఆదరం ఎండమావి వంటివే......... ....అని సుమతీ శతకకారుని వాక్కు. *చెడ్డ స్వభావం కలవారితో, కులసతులు కానివారితో, అప్పు ఇచ్చే వారితో వీలైనంత దూరంలో ఉంటూ, మంచిని పెంచి పోషించే వారికి సాధ్యమైనంత దగ్గరగా ఉంటూ, వారిని ప్రోత్సహిస్తూ మనం ధన్యులమౌతూ, మనతో ఉన్నవారిని కూడా మంచి మార్గంలో తీసుకుని వెళ్ళాలి అని భావం.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు