సుమతీ శతకం ౨౪వ పద్యం. కసుగాయఁ గరచి చూచిన మసలక తన యొగరుగాక మధురంబగునా పసగలుగు యువతులుండఁగఁ బసిబాలల బొందువాఁడు పశవుర సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .. మగ్గిన, పండిన పండ్లను వదలి కసుగాయలను/పచ్చి కాయలను తింటే వగరు గానే వుంటుంది కానీ, పండిన పండు రుచి రాదు. ఆలాగే, యుక్త వయస్కులైన యువతులను కాదని పసివయసు చిన్నారులను కూడిన వానిని పశువు అనే అంటారు. అటువంటి వానికి ఎటువంటి సుఖము దొరకదు. అటువంటి వానిని మనుషులు కాదుకదా, పశువులు కూడా తమతో పోలిక లేదంటాయి. ....... ....అని సుమతీ శతకకారుని వాక్కు. *మనిషైనవాడు, పరమేశ్వరుడు తనకు ఇచ్చిన తెలివితేటలు సరిగ్గా వాడుకుని, తారతమ్యాలు తెలిసి, సంఘంలో పదిమంది కి ఉపయోగపడే విధంగా జీవించాలి అని భావం.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు