సుమతీ శతకం ౩౫వ పద్యం. కొరగాని కొడుకు పుట్టినఁ కొరగామియె గాదు తండ్రి గుణముల ఔరంచు జెరకు తుద వెన్న పుట్టినఁ జెరకునఁ దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .... చెరకు గడచివర వెన్నుపడితే, చెరకు గడ మొత్తాన్ని పిప్పి చేసేస్తుంది. అలాగే, ఒక తండ్రి కి/ఒక యింట్లో ఒక దుష్టుడు, దుర్లక్షణములు కలవాడు పుడితే, ఆ తండ్రి కి మాత్రమే కాక మొత్తం వంశానికే చెడ్డ పేరు తెస్తాడు........... ....అని సుమతీ శతకకారుని వాక్కు. *మనకు మళ్ళీ, మహాభారతం గుర్తుకు వస్తుంది. సుయోధనుడు పుట్టినప్పుడు ధృతరాష్ట్ర మహారాజు తనకు కురువంశోద్ధారకుడు పుట్టాడని సంబరపడతాడు. కానీ ఆ గాంధారీ తనయుడు తన వంశమే కాకుండా ౧౮ అక్షౌహిణుల వినాశనానికి కారణమైనాడు. అందువల్ల, సంతానం కొరకు పరమేశ్వరుని అడిగేటప్పుడు సత్సంతానం ప్రసాదించమని ప్రార్ధించాలని భావం.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం : - S. అన్విక -7వ తరగతి-జి.ప.ఉ.పా.తొగుట.మండలం తోగుట-జిల్లా సిద్దిపేట
• T. VEDANTA SURY

చిత్రం : -M.దీక్షిత -8వ తరగతి -జి.ఉ.పా.తొగుట--సిద్దిపేట జిల్లా
• T. VEDANTA SURY

ఎదురుచూపు!!:-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం
• T. VEDANTA SURY

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు..జవహర్ నవోదయ విద్యాలయాలు.:-ఇల్లూరి క్రాంతి కుమార్.
• T. VEDANTA SURY

Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి