సుమతీ శతకం ౩౩వ పద్యం. గడనగల మననిఁ జూచిన నడుగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో గడ నుడుగు మగనిఁ జూచిన నడుఁపీనుగు వచ్చె ననుచు నగుదురు సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .... (చాలా ఎక్కువ మంది స్త్రీల లో ఉన్న లక్షణాలను శతకకారుడు ఇక్కడ చెపుతున్నారు.) ధనము సంపాదించ గలిగిన, వయసు లో వున్న పురుషుని చూచి అతివలు/స్త్రీలు, అట్టి మగవారికి అడుగులకు మడుగులు ఎత్తుతూ ఉంటారు. కానీ అదే మగవనికి వయసు పైబడి, బుద్ధి మందగించి, సంపాదన లేనపుడు ఏ మాత్రము ఆదరణ గానీ గౌరవం గాని చూపించరు/ఇవ్వరు........... ....అని సుమతీ శతకకారుని వాక్కు. *కానీ వైవాహిక బంధానికి ఒడబడిన జంటలలో ఇటువంటి వైపరీత్యాలు కనబడవు. మన హిందూ ధర్మం లో ధనార్జన జీవనానికి అవసరం, కానీ ధనార్జనే జీవన హేతువు కాదు. ధనార్జనకు మించి, ఆత్మాన్వేషణ, నలుగురి మంచి కోరుతూ నలుగురితో కలసి వుంటూ జీవనం గడపడం ఉత్తమము.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు