సుమతీ శతకం ౨౯వ పద్యం. కూరిమిగల దినములలో నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మరి యా కూరిమి విరసంబైనను నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ! తా : (మన చిన్నతనం లో కంఠస్థం చేసిన పద్యమే) ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .. మనకు మన సన్నిహితునికి మధ్య స్నేహం చక్కగా వున్నపుడు, మన మధ్య ఎన్ని పరుష వాక్యాలు వచ్చినా, ఒకరి వల్ల ఒకరికి ఇబ్బంది కలిగినా, చాలా ఆనందంగా ఒకరి మీద ఒకరికి వున్న స్నేహ బాంధవ్యం వల్ల జరిగినవే అనుకుంటాము. కానీ వీటిని తప్పు పట్టము. ఆ యిద్దరి మాధ్య స్నేహం చెడిపోయిన తరువాత పలుకరింపుగా నవ్విన చిరునవ్వు కూడా మనల్ని ఎగతాళి చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఎంతో సామాన్యంగా చూచే చూపు కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇది లోక లక్షణం.......... ....అని సుమతీ శతకకారుని వాక్కు. ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు