గురువుకు దండం (బాలగేయం) మా మంచి గురువుకు దండాలు మనసున్న దేవుడికి దండాలు అమ్మ ఒడివంటిదే బడియంటూ అభయమిచ్చు గురువుకు దండాలు ఆటల్లో పాటల్లో మేటియంటూ వెన్నుతట్టు గురువుకు దండాలు అక్షరాలు దిద్దించీ దారి చూపి వెలుగునిచ్చు గురువుకు దండాలు ఎత్తెత్తూ ఎదగాలని దీవించీ హత్తుకునే గురువుకు దండాలు. పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు