ఈ కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్న వాళ్ళు.... ముఖ్యంగా వైద్యులు,పోలీసు వ్యవస్థ, పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళ గురించే అందరూ పొగుడుతున్నారు...మీడియా రంగం కూడా ఎంతో శ్రమిస్తోంది...రిపోర్టర్లు నిరంతరం మనకు వార్తలు అందిస్తున్నారు...డాక్టర్లచేత ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నారు...వెళ్ళకూడని ప్రదేశాలకు కూడా వెళ్ళి మనకు ప్రపంచం నలుమూలలలో ఇది ఎంతగా విజృంభిస్తోంది...ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలో తెలియజేస్తున్నారు....కొన్ని దినపత్రికలు ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా పని చేస్తున్నాయి...ఏరోజు వార్తలు ఆరోజు అందించాలని ఆరాట పడుతున్నాయి...ఈ మీడియా (టివి, పేపర్) అనేది లేకుంటే మనకు "కరోనా" అనేది ఇంత భయంకరమైన వైరస్ అని తెలిసేది కాదేమో కదా...మరి మన మీడియా సోదరులకు కూడా మనందరం కృతజ్ఞతలు తెలుపుకుందాం...వైద్యులకు , రక్షణవ్యవస్థ, పారిశుద్ధ్య కార్మికులు మరియు మీడియా సిబ్బంది...అందరికీ శతకోటి వందనాలు... వాళ్ళ అందరి శ్రమకు భారతావనిలోని ప్రతి ఒక్కరూ ఋణపడి ఉంటారు ఎప్పటికీ...ఆ ఋణం తీర్చుకునే అవకాశం కూడా ఉంది మనకు...అదేంటంటే లాక్డౌన్ తీసేసిన తరువాత కూడా సామాజిక దూరం పాటిస్తూ అవసరం ఉంటే తప్ప కొన్నాళ్ళ వరకు ఇంట్లో లాక్ అయి ఉండడం.... మరి ఉండాలి తప్పదు ఎంత కష్టమైనా..--శాంతి కృష్ణ


కామెంట్‌లు