కరోనాపై కదనానికి.... పిల్లలు కూడా సమరంలో ఆయుధంగా మారుతున్నారు బుల్లి బుర్రలకు పదునుపెట్టి పరిశోధన మొదలు పెట్టి తమదైన శైలిలో సమస్యకు పరిష్కారం వెదుకుతున్నారు జాలి గలిగిన గుండె జాగ్రుతమై జగతికి జాగ్రత్తలు నేర్పుతోంది కరోనా కోటను ముట్టడించి కట్టడి చేసి కడతేర్చడానికి పధకాన్ని రూపొందించి పదిమందికీ పంచుతోంది కనపడని కరోనా పేరు వినపడని రోజు కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తోంది ఆలోచన అయినా ఆచరణ అయినా ఇంటినుంచే మొదలై విశ్వవ్యాప్తం కావాలి సమరం గెల్చిన వెంటనే సంతోషం గుప్పుమని ప్రతి కంటా ప్రతి ఇంటా వువ్వెత్తున ఎగిసి వెలిగే మతాబుల్ని చూడాలని 'హర్షిణి' వువ్వీళ్ళూరుతోంది - దాసరి వెంకట రమణ


కామెంట్‌లు