ఒక యాది --------------- మాగ్రామం మారుపాక మం-వేములవాడ చిన్నతనంలో యేఅనారోగ్యంవఛ్చినా వేములవాడ కే వెల్లేది మండలం మొత్తానికి ఒకడే డాక్టర్ పేరు సుభ్రమణ్యం ఆయుర్వేద వైద్యుడు పాలమూరు జిల్లా కొల్లాపురం ముద్దుబిడ్డడు అన్నగారిని అనుసరిస్తూ ఇక్కడ స్థిరపడ్డారు ప్రశాంత వదనం మందహాసంతో పలుకరింపు చూడగానే రోగికి ఒక ధీమా రోగం పోతుందని ఆయుర్వేద గోళీలు చెట్ల కషాయం యిచ్ఛేది కషాయం మాత్రం అన్నిరోగాలకు ఒకటే జనాలు పెట్టుకున్న పేరు సర్వరోగ నివారిణి సీసావెంట తీసుకెల్తే లేదనకుండా పోసేది ఎవరినీ డబ్బులడిగి యెరగడు ఎంతిచ్చినా సంతోషించేది ఇవ్వకున్నా వైద్యం చేసేది యెంత గొప్ప దయాగుణమో నాకనిపిస్తుంది ఇప్పుడతడుంటే సర్వరోగ నివారిణి కషాయంతో కరోనా పారిపోయేదికదా అని ....! డాక్టర్ మంగారి సుభ్రమణ్యం గారి యాదిలో .. చెన్నమనేని ప్రేమసాగర్ రావు


కామెంట్‌లు