కరోనా విల విల..! గంపెడు కుండల్ని నెత్తిన మోస్తూ నిప్పుల గుండం లోంచి గల్లీ గల్లీ తిరుగుతోంది ఆ తల్లి కుండలమ్మో.. కుండలంటూ.. అదేపనిగా..ఆయాసపడుతూ ఉన్నొక్క ఉప్పూరిన రైక రంగు వెలిసిన ముతక చీర వెన్నులోంచి చెమట కాలువలు మొహం నిండా దిగులు మబ్బులు ఒక్క కుండన్నా.. ఆకలిని తీరుస్తుందేమో నాన్న గంపెడాశ ! పిల్లికూనలా వాడ వాడ వడబోస్తుందా తల్లి గొంతెండిన ఆమె జీరకేకలు అరణ్యరోదనే.. ఎక్కడ చూసినా మూసిన తలుపులు.. ప్రాణాలరచేత పట్టుకున్న జనం కరోనా కాలం భూగోళానికే తాళం పడింది ఇప్పుటికీ సరిగ్గా నెలా కులవృత్తులు విలవిలా చాకలి మంగలి కమ్మరి కుమ్మరి కూచుండి తినే గుట్టలు వాళ్లకెక్కడివని! చెయ్యాడందే పూట గడవదు ప్రపంచమే విలయతాండవమ్ ఇప్పుడెవరు తల్లీ నిన్ను పట్టించుకునేది.! మామూలప్పుడే మట్టి పాత్రలు వాడకం అంతంత తాతలనాటి తలరాతనుకొని శ్రమ ఫలితాన్ని ఆశించకనే రోజులు ఎల్లదీస్తివి కదా..! ప్రపంచీకరణ తోనే మట్టి కుండలు మొర్రి ఓయినాయి ఇప్పుడేం ఒరగ పెడతాయని..! అత్యాశ కాకుంటే! లోహరాకాసి కన్నా ముందు బువ్వకుండే కడుపునింపింది గల్లగురిగి నుంచి గాజబొత్త దాకా మంగుళం పెంకనుంచి మారెసరుబుడ్డి దాకా ఇంటినిండా మట్టి దొంతరల వైభవమే.. మరిప్పుడో.. కాలం విసిరిన కత్తులమీద ఊగిసలాడే పయనం అమ్మా! కుండలమ్మా..ఇటురా తల్లీ.. గిన్ని మంచిల్లు తాగి ఆ కుండలిచ్చి పోదువు ..ఆన్నాను గానీ అదెంతకాలం పరిష్కారమో నాకు తెలియనిదా ఏంటి.. వాడిపోతున్న మొక్కలకి నీళ్లు చిలకరించడమే.. కారోనా..! కులవృత్తుల రెక్కలురాలి కూలబడుతున్నాయ్! నువ్వన్నా.. కరుణించి మాయమవ్వరాదే..! మా తల్లివి గనీ.! nampally sujatha


కామెంట్‌లు