లీలా కృష్ణ (బాలగేయం) సిరిసిరి మువ్వలు చిందులు వేయగ ముసిముసి నవ్వులు కన్నుల మెరియగ రారా కృష్ణా!రాధా కృష్ణా! నీలి వర్ణము నెమలి ఫింఛము మురళి గానము మధుర నాదము రారా కృష్ణా!రాధా కృష్ణా! రేపల్లె వాడలొ వెన్నలు దోచి ఉట్టియందక పీటలు వేసి పాలకుండలో మీగడ మ్రింగి కిలకిల నవ్వుతు లీలలు చూపిన గోకుల కృష్ణా! గోపాల కృష్ణా! రారా కృష్ణా!రాధా కృష్ణా. పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు