ద్రౌపతి.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్. ద్రుపదమహారాజుకుమార్తె ద్రౌపతి.పాండవులభార్య.ఈమెతనతొలి జన్మలో 'నలయానుడు'అనే ఋషి కూతురు.అప్పటిపేరు'ఇంద్రసేన' 'మౌద్గల్యుడు' అనే మునిభార్య.అతను కుష్ఠివ్యాధి పీడితుడు కావడంవలన ఆమె చేసిన సేవలకు మిక్కిలిసంతసిల్లి ఆమెను వరం కోరుకోమనగా తనభర్తను ఐదురూపాలలో తనను సంతోషించమంది.అనంతరం మరుజన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించి శివుని గురించి తపస్సు చేసి మెప్పించి వరంకోరుకోమనగా,పతి,పతి,పతి,పతి,పతి అని ఐదుమార్లు పలకడంతో 'తధాస్తూ'అనిశివుడు వెళ్లిపోయాడు.మరుజన్మలో ద్రౌపతిగా జన్మించి పాండవులకు భార్యఐయింది.ఆమె యజ్ఞకుండమున పుట్టుటవలన 'యజ్ఞసేనా'అని,పాంచాలరాజు కూతురైనందున 'పాంచాలి'అని,ఈమె అసలుపేరు కృష్ట.ఈమెకు ధర్మరాజువలన ప్రతివింధ్యుడు,భీమునివలన శ్రుతసోముడు,అర్జునివలన శ్రుతకీర్తి,నకులునివలన శతానుకుడు, సహదేవునివలన శ్రుతసేనుడు జన్మించారు.వీరందరిని ఉపపాండవులు అనిఅంటారు.కురుక్షేత్రసంగ్రామంలో రాత్రి నిద్రిస్తున్నసమయంలో పరమేశ్వర వరప్రసాదమైన ఖడ్గంతో అశ్వత్ఢామ వీరందరిని సంహరించాడు. పాండవులు స్వర్గారోహణ చేస్తున్నసమయంలో తొలుత ప్రాణాలు వదిలింది ద్రౌపతి.


కామెంట్‌లు