పచ్చి మొక్క జొన్నకంకి ఔషధ గుణాలు -మొక్క జొన్న పంట పండే కాలం లో కాల్చిన మొక్క జొన్న కంకులను సరదాగా తింటూ రోడ్లపై మనకు కనబడుతుంటారు. లేత మొక్క జొన్న మంచి పోషకాలు కలిగి ఉండి తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. దీనికి ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువే కొన్ని పచ్చి మొక్క జొన్నలను మిక్సీలో వేసి ముద్దగా చేసి ఒక గిన్నెలో వేసి నీరు పోసి కొద్దిగా జిలకర + ఉప్పు వేసి సూప్ గా తయారు చేయాలి. ఇది మంచి రుచితో పాటు శరీరానికి శక్తిని ఇస్తుంది. విలువైన విటమినులతో పాటుగా పీచు పదార్థాలను కలిగి ఉంటుంది. అనారోగ్యాంగా వున్న వారు కూడా ఈ సూప్ తాగితే త్వరగా కోలుకుంటారు. అన్నింటికన్నా ముఖ్యం గా మూత్ర పిండాలలోని రాళ్లకు ఇది మంచి మందు. లేత మొక్కజొన్న గింజలు తీసేసిన కండె భాగం ముక్కలు చేసి నీరు పోసి మరిగించి కషాయంగా చేసి మిరియాల పొడి వేసి తాగితే దగ్గు, కోరింత దగ్గు , ఎక్కిళ్ళు తగ్గి పోతాయి మొక్క జొన్న కంకి చివరలో వుండే పీచు లో నీరు కలిపి కషాయంగా చేసి తాగితే మూత్రావరోధం తగ్గుతుంది. మూత్రకోశం వాపు కూడా వెంటనే తగ్గి పోతుంది. - పి . కమలాకర్ రావు


కామెంట్‌లు