విద్యార్ధి ఇలా ఉండాలి(కథ)--లాహోర్ విశ్వవిద్యాలయంలో 1892 వ సంవత్సరంలో బి.ఏ. గణితశాస్త్రం పరీక్షలు జరుగుతున్నాయి. ప్రశ్నాపత్రంలో 13 ప్రశ్నలిచ్చి వాటిలో ఏ తొమ్మిదింటికైనా జవాబు వ్రాయమని అడిగారు.ఒక విద్యార్ధి 13 ప్రశ్నలకూ జవాబులు వ్రాసి “ పై వాటిలో ఏ తొమ్మిదింటికైనా మార్కులు వేయవచ్చు” అని అడుగున వ్రాసాడు.ఆ విద్యార్ధికి విశ్వవిద్యాలయంలో ప్రధమస్థానం లభించింది. అతడే స్వామి రామతీర్ధ. దేశవిదేశాలలో పేరొందిన తీర్థారామగోస్వామి.1906 అక్టోబరు 17 వ తేదీన తన 33 వ యేట స్వామి రామతీర్ధ గంగానదిలో జలసమాధి పొందారు.-నారంశెట్టి ఉమామహేశ్వరరావు


కామెంట్‌లు