మానేరు ముచ్చట్లు--నిన్న మా లక్ష్మీరాజం సారు గురించి ఇవాళ చెబుతానన్నాను గదా!అయితే సారు గురించి చెప్పడం ఎక్కడనుంచి మొదలు పెట్టా ల్నో అర్థంగాక కొంచెం తికమక పడ్డాను.ఎందుకంటే నేను చాలామందిని చూశాను గానీ ఆయనంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తులను మాత్రం చాలా అరుదుగా చూశాను. సూర్యుడి టైంటేబుల్ లాగా ఆయన దినచర్యను గనక పరిశీలిస్తే ఒక క్రమ పద్ధతి కలిగి ఉండటం ఆశ్చర్యకరం. విచిత్రమైన విషయం మరొకటేమిటంటే ఒకే ఊర్లోఆయనన్ని రోజులు పని చేసినవారుతక్కువ మంది ఉంటారు. నేను చిన్నబళ్లో చదువుకున్నప్పట్నుంచి మొదలు పెడితె నేను పెద్దబడిలో చదువుకుని,కరీంనగర్ లో కాలేజీ చదువు పూర్తి చేసి,ఆ పై కాగజ్నగర్ లో ఉద్యోగం చేస్తూ,కంపెనీలో పదేండ్లు,పనిచేసి అది బందయితే టీచరు ట్రెయినింగు జేసి టీచరునయి పిల్లలు పుట్టి,వాళ్ల చదువులు పూర్తయి,వాళ్లు అమెరికాలో సెటిలయియ్యారనేదాకా నేను మధ్యమధ్య ఎలగందులకు పోవడం తటస్థించడం సారు కనిపిం చడం జరిగేది.ప్రతిరోజు కొత్తసూర్యుణ్ని చూసినట్టే.ఇంత సుదీర్ఘమైన వివరణ ఎందు కంటే నేను చిన్నతనం మంచినీళ్ల బిందె మోసే వయసు వచ్చినప్పట్నుంచీ ఆయ నను చూస్తూ వస్తున్నాను.మా ఊరికి ఏం శాపమో గాని కాకతీయులు ఊరి చుట్టూ కట్టిన మట్టి ప్రాకారం లోపల ఎక్కడా మంచి నీటి వసతి లేదు.శ్రీశ్రీ ని పేరడీ చేస్తూ రాస్తే గనక ఇలా రాయాలి. “ఏ బావిలొ నీళ్లు తాగినా ఏమున్నది చెప్పడానికి ఎలగందులఊళ్లో బావుల నీళ్లన్నీ కటిక చేదులే” అప్పట్లో ఇప్పటి లాగా ఇంటింటా నల్లా గానీ,లేదా ఇరవై లీటర్ల బాటిళ్లు ఇంటికితెచ్చి వేసే వ్యవస్థ గానీ లేవు.పెద్ద వాళ్లకు వేరే పనులుంటాయి గనుక ఇంట్లో బిందె మోయ గలిగే పిల్లలందరూ ఊరవతల,కాలువకో,మానేరుకో,సర్కారు బావికో,గచ్చు బావికో,భట్టును బావికో, జాఫర్ఖాన్ బావికో పోయి నీళ్లు తెచ్చుకోవలసిందే.ఇంకా అప్పటికి బ్రాహ్మలు వేరే వాళ్లు తెచ్చిన నీళ్లు తాగేస్థాయికి ఎదగలేదు కనుక చచ్చినట్లు మంచినీళ్లకు మేం పోవలసిందే.పై సోర్సులన్నీ చెప్పినా అవన్నీ అయితే దూరం అదీ కాక ఏ బావిలో నీరైనా పప్పు ఉడికేదేమో కాని ,దప్పి తీరేంత తియ్యగా ఉండేవి కావు.కనుక కాలువకే వెళ్లేవాళ్లం. కాలువకు వెళ్లిన సమయంలో లక్ష్మీరాజం సారు బట్టలుతుక్కుని స్నానంచేసి ఎదుర య్యేవారు త్రోవలో.ఆ ఊళ్లో కాలువ పారినన్ని రోజులు ఆయన సమయసారిణిలో కాలువలో స్నానానికి ఎన్నడూ నాగా లేదు.ఇది ఒక ఉదా హరణ ఆయన నియమపాలన గురించి.ఆయన మాకు తొమ్మిది,పది పదకొండు తరగతులకు జీవరసాయన శాస్త్రాలు బోధించారు.అంటే 1965 నుండి 68 వరకు,దాదాపు 55 సంవత్సరాల క్రితం ఆయన వేసిన జీర్ణ మండలం బొమ్మ గానీ,ఆయన చేసిన ఆమ్లజని,ఉదజని తయారీల ప్రయోగాలు గానీ నిన్ననే చూసినంత స్పష్టంగా ఉన్నాయంటే ఆయన బోధన ఎలాంటిదో వేరే చెప్పవలసిన పని లేదు.పార్థసారథి గారున్నపుడు బడిలో ఏ కార్యక్రమం జరిగినా మైకులు సిద్ధం చేయడం గానీ,ప్రార్థన కంటే ముందు రికార్డ్ ప్లేయర్ మీద పాటలు వేయడం గానీ,రేడియో కార్యక్రమాల ప్రసారంగాఅన్నీ ఆయనే నిర్వర్తించేవారు.ఆయన చేసిన కప్ప డిసెక్షన్ నాకిప్పటికీ గుర్తే. నాగరాజు రామస్వామి గారు ఆయన మంచి స్నేహితులు.అక్కడ ఉన్నప్పుడు రోజూ సాయంత్రం కలిసి బాల్ బ్యాడ్మిం టన్ ఆడుకునేవాళ్లు. బతికి నన్నాళ్లూ ఆయనను ఎప్పుడు చూసినా ఒకటే రూపం.అదే చిరునవ్వు, అదే హెయిర్ స్టైల్,అవే దుస్తులు.ఊరు పాడుబడిన దాకా పాత ఇంట్లో నే ఉన్నారు.తరువాత మేము కొత్తగా కట్టుకున్న ఇంట్లో కిరాయకున్నారు. నేను ఎలగందులలో లేకున్నా అప్పుడో ఇప్పుడో వచ్చినపుడు చూసే వాణ్ని. ఆయన పదవీ విరమణ సందర్భంగా 1998లోబాపు ఆయన మీద కొన్ని పద్యాలురాసి అభినందనలు తెలిపారు. అందు లోని రెండు ఆయన వ్యక్తిత్వాన్ని చాటేవిచూడండి. ‘లబ్ధ కీర్తి పరుడు లక్ష్మిరాజము సారు కపటమెరుగనట్టి ఘనుడు తాను బడిని గుడిగనెంచు భావమ్ము తోడను పగలు రాతిరనక పాటుపడియె’ ‘కట్టుబాటు నడచి కదిలించడ నితరుల మాట మన్నన తోడ మసలె తాను ప్రతిభ చాటుకొనెను ప్రధానాచార్యుడై భానుతేజరూప పద్మనాభ’ పార్థసారథి గారిని చివరి రోజుల్లో చూసినట్టే,ఇటీవల తమ్ముని కొడుకు శుభలేఖ ఇవ్వడానికి వెడుతుంటే నేను కూడా వెళ్లి కలిసి వచ్చాను.అప్పటికి ఎనభయికి దగ్గరలో ఉన్నారాయన. ఆప్యాయంగా పలుకరించారు.ఆయన నన్ను మీరు అని పలుకరించకుండా ఏరాఅంటే బావుండేది.కానీ ఆయనంతేఆయనకు నేను గురుపుత్రుణ్ని.ఈ మధ్యనే ఆయన కాలంచేశారని విన్నాను. ఆయనకు నా నివాళి. రాంమూర్తి సారు తెలుగు,నారాయణ చారి సారు హిందీ,పార్థసారథి సారు ఇంగ్లీషు,పత్తి భూమయ్య సారు ఐచ్ఛిక గణితము(అజంతా బీజగణితము,అజంతా రేఖాగణి తము),ఐలయ్య సారు సాధారణ గణితము(తులసీ గణితము) లక్ష్మిరాజముసారు విజ్ఞాన శాస్త్రము, లక్ష్మినారాయణ సారు హిందూదేశ చరిత్ర,వెంకటప్పయ్య సారు భూగోళ శాస్త్రము (మన ప్రపంచం)చెప్పారు.కొన్ని క్లాసుల్లో కొందరు మారినా ఆ బడిలో పాఠాలు చెప్పిన వారంతా గురువు శబ్దానికి విలువ తెచ్చిన వారే. వారం దరకీనా నమస్సులు.పండుటాకుల్లా ఒకరిద్దరు తప్ప మిగతా వారందరూ రాలిపోయారు.కానీ మా మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.నేను తొమ్మిది, పది తరగతుల్లో ఉన్నప్పుడు పైన చెప్పిన సార్లలో కొందరు బదిలీ అయి వెళ్లారు.పార్థసారథిగారి స్థానంలో నాగమల్లయ్య,రామమూర్తి గారి స్థానంలోకే.రాజశర్మ ,నారాయణాచార్యుల స్థానంలో బి.నారాయణ సారు వచ్చారు.రాజశర్మగారు మాతో ‘భువన విజయం’తయారు చేశారు.అందులో ఎలనాగ శ్రీకృష్ణదేవరాయలు,నేను అల్లసాని పెద్దనగా రిహార్సల్సు చేశాం.ఎందుకో గానీ ప్రదర్శన జరగలేదు.ఆయన మంచి కవి,గాయకులు, ఆలిండియ రేడియో హరికథా కళాకారులు.పదకొండవ తరగతిలో ఇంగ్లీషు చెప్పిన సాంబశివ రెడ్డి సారుప్రస్తుతం నాగోలులో ఉన్నట్టు మొన్ననే తెలిసింది.లాక్డౌన్ తరువాత కలువాలి.- రామ్మోహన్ రావు తుమ్మూరి


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
భళిరే నైరా
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం