పత్రికారంగంలో శ్రమిస్తున్న మిత్రులందరికీ శుభాకాంక్షలు --ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవాన్ని మే 3 వ తేదీన యునెస్కో నిర్వహిస్తుంది. ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశపు విండ హాక్ నగరంలో 1991 ఏప్రిల్ 29 నుండి మే 3 వ తేదీవరకు యునెస్కో నిర్వహించిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పలు తీర్మానాలు చేశారు. స్వేచ్ఛాయుతమైన, స్వాతంత్ర్యమైన, ప్రపంచవ్యాప్తంగా బహుళ జాతుల సమన్వయానికి మాధ్యమంగా, ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి, ఆర్ధీకాభివృధ్ధికీ, పౌరుల ప్రాధమిక హక్కుయైన పత్రికా స్వేచ్చ పరిఢవిళ్లడం అవసరం. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రపంచ పత్రికా దినోత్సవాన్నిడిసెంబర్ 1993లో ప్రకటించింది ఐక్య రాజ్య సమితి 19వ ఆర్టికల్ లోనే పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన మూలాలు ఇమిడి ఉన్నాయి “భావ స్వేచ్చ, ప్రకటన, స్వేచ్ఛగా అభిప్రాయాలను కల్గియుండటం ప్రపంచంలోని ప్రతీ పౌరుని ప్రాధమిక హక్కు. ఈ హక్కుల ఇతరుల దయా దాక్షిణ్యాలతో వచ్చినవి కావు, జన్మతో స్వతఃసిధ్ధంగా సంక్రమించినవి. (మన రాజ్యాంగంలో కూడా ప్రాధమిక హక్కులను చర్చించింది 19అధికరణంలోనే) రాజకీయాలలోనూ, పరిపాలనలోనూ స్వచ్ఛత విలసిల్లడానికీ, పరుగెత్తేకాలంతో సమాంతరంగా ప్రజల ముంగిటికి వార్తలు అందించే విలేకరులు ప్రతీ దినం ఎన్నో దాడులను, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. కొందరు జైళ్ల పాలవుతున్నారు, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరి వివరాలు తెల్యకుండా పోతున్నాయి. పత్రికాస్వేచ్చా హరణంలో ఇరాక్ ప్రధమ స్థానాన్ని సంపాదిస్తే భారతదేశం 8వ స్థానంలో ఉంది.పత్రికా స్వేచ్చ ప్రతీ సమాజానికి, వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది. ఆ దేశంలోకానీ, సమాజంలోకానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడమంటే ఆ సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేయడమే. పత్రికా స్వేచ్చా పారదర్శకతను తద్వారా సుపరిపాలనను పెంపొందిస్తుంది. పత్రీకా స్వేచ్చ అవగాహన, విజ్ఞానాలను అనుసంధానం చేసే వారధి వంటిది. జాతులు, సంస్కృతుల మధ్య భావ మార్పిడికి, వాటి అభివృధ్ధికి పత్రికలు, పత్రికా స్వేచ్చా తప్పనిసరి.ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రమాదపుటంచుల్లో వార్తలు సేకరించే విలేకరులకు (లేదా మరిణించిన విలేకరులకు) యునెస్కో/ గ్యూలెర్మో కనో ప్రపంచ పత్రికా స్వేచ్చా బహుమతిని ప్రదానం చేస్తారు. కొలంబియకు చెందిన గ్యూలెర్మో కనో అనే విలేకరి డ్రగ్ మాఫియాను ఎండగడుతూ 1986లో తన పత్రికా కార్యాలయం ఎదుటనే హత్యకు గురయ్యాడు. గ్యూలెర్మో కనో సంస్మరణార్ధం ఏర్పాటుచేసిన ఈ బహుమతి విలువ $25000 (అమెరికా డాలర్లు). ఈ సంవత్సరపు బహుమతి గ్రహీత ఐజర్బైజాన్కు చెందిన మహిళా పాత్రికేయురాలు ఖడీజా ఇస్మాయిలోవాకు ఫిన్లాండ్లో ప్రదానం చేయనున్నారు . ఐజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్, అతని కుటుంబసభ్యుల అవినీతినీ, లంఛగొందితనాన్ని ఎండగడుతూ ఆమె 2010నుండి ఒక సంవత్సవరకాలం ఫ్రీ రేడియో యూరప్‌లో కధనాలు రాసింది. ప్రభుత్వమామెను 2014లో నిర్బంధించి పన్ను ఎగవేత నేరారోపణపై ఏడున్నర సం. కఠిన కారాగార శిక్షను అంతర్జాతీయ సమాజం ప్రతిఘటించింది. ప్రజలకోసం, పత్రికా స్వేచ్ఛాకోసం కృషిచేస్తున మన పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ, అసువులు బాసిన సంపాదకులకు, విలేకరులకు ఈ రోజున నివాళులర్పించడం మన కనీస ధర్మం
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం :సిహెచ్.పూజ-8వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాలఘణపురం మండలం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

బాల కథల పోటీ -2025
• T. VEDANTA SURY

చిత్రం : -బి.ఈశ్వరి,-9వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాల గణపురం మండలం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

పేదవాడు!!? - డా ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY

Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి