చిలకమ్మకు విందు ******************** (బాలగేయం) చేయీ చేయీ కలిపాము జొన్న చేనుకు వెళ్ళాము చేను గట్టుపై చిలకమ్మ రివ్వున ఎగురుతు వచ్చింది. చిలుక పలుకులు చెప్పింది చిగురులు తెంపి ఇచ్చింది జొన్నకంకిపై వాలింది గింజలు ఒలిచి ఇచ్చింది ఒలిచిన గింజలు కలిపాము గువ్వల చిన్నికి ఇచ్చాము గువ్వలచిన్నీ గింజలను విసిరుతు రవ్వగ చేసింది జొన్న రవ్వతో పాయసము ఎంతో రుచిగా ఉందండి చిలకను విందుకు పిలిచాము జొన్న పాయసం పెట్టాము. పద్మ త్రిపురారి జనగామకు


కామెంట్‌లు