సుమతీ శతకం ౪౩(43)వ పద్యం. తములము వేయని నోరును విమతులతో జెలిమిసేసి వెతఁబడు తెలివిన్ గమలములు లేని కొలకుఁను హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .... తాంబూలము వేసుకోని నోరు, చెడుస్నేహాలు చేసి అయ్యో తప్పు చేస్తున్నామే అనే భావం లేని మనిషి, నీటితో నిండుకుండ వలె వుండి కమలములు లేని చెరువు, చందమామ లేని పున్నమి రాత్రి, ఎందుకూ కొరగావు, రాణించవు........... ....అని సుమతీ శతకకారుని వాక్కు. *చందమామ లేని రాత్రి, కలువలు లేని కొలను ఎంత కళావిహీనంగా వుంటాయో మనకు తెలుసు. అలాగే, ఎంత ధనం సంపాదించినా లోభిగా వుండి అనుభవించ లేకపోవడం దౌర్భాగ్యం. ఎదుటి వారితో మన వ్యవహారశైలి వల్ల వారు బాధ పడ్డారు అని తెలిసి కూడా వారి దగ్గరకు వెళ్ళి క్షమ అడగలేక పోవడం, చలా దౌర్భాగ్య పరిస్థితి. ఎదుటివారిని క్షమ అడుగలేనప్పుడు ఎన్ని సుగుణాలు వున్నా అవి ఎందుకూ అక్కరకు రావు.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు