సుమతీ శతకం ౫౧(51)వ పద్యం. నమ్మకు సుంకరి జూదరి నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్ నమ్మకు మంగలి వానిని నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ ... పన్నులు వసూలు చేసే వారిని, జూదం ఆడే వారిని, కంసాలి వానిని, నటించడమే జీవితంగా(వృత్తి కాకుండా ప్రవృత్తి గా) చెసుకున్న వారిని, వేశ్యలను, మంగలివారిని, ఎడమ చేతితో పనులు చేసేవారిని నమ్మ వద్దు....... ....అని సుమతీ శతకకారుని వాక్కు. *పైన చెప్పిన పనులు చేసే వారితో సంఘ పరంగా కలిసి నడవ వలసి వచ్చినపుడు జాగరూకతతో మెలగాలి అని భావం.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు