ఆనాటి బాలసాహిత్యంలో బాలల యొక్క మానసిక ఆరోగ్య రక్షణలకు పోషణలకు తల్లులే బాధ్యత వహించే వారు. పసిప్రాయం లో పిల్లలకు వచ్చే జబ్బులకు అంటే చిడుము జలుబు దగ్గు లకు ఇంట్లో చిట్కాలు ఉపయోగపడేవి. ఈ చిట్కాలు తల్లులకు బాగా తెలిసేది. మంచి వైద్య సాధనాలు ఇంటిలో దొరికే వస్తువుల తోటే కళ్ళు వైద్యం చేయవచ్చు. ఏ వైద్యుడు అవసరం లేకుండా తల్లి చేసేది పిల్లల ఆరోగ్య పోషణ తల్లులదే కనుక వారు వ్యవహరించే తీరును చిన్నచిన్న గేయాలలో మలచి బాల సాహిత్య కారులు ఈ విధమైన బాల గేయాలు తల్లుల చేతిలో పెట్టారు. ఆ నోటా ఈ నోటా ఆనాటి తల్లి నుండి తనయకు సంక్రమించేలా ఆచార సాంప్రదాయ వ్యవహారాలలో ఇమిడ్చి కట్టుదిట్టం చేశారు దైనందిన జీవిత విధానంలో లో ముడివడి ఉన్న ఈ గేయాలు గేయ చిట్కాలు నశించిపోయే అవకాశం లేదు. వాటికి శాశ్వత తత్వాన్ని అలా అమర్చారు. ఈ ప్రక్రియ ను, దృష్టిలో పెట్టుకొని ఒక వైద్య మిత్రుడు అలాంటి గేయాన్ని ఒకటి రచించాడు. తేలు కుడితే వేయవలసిన మందు ఇదే గోడమీద బొమ్మ -గొలుసుల బొమ్మ, బొమ్మ చేసే రిమ్మ, తిరుగును దిమ్మ, విషపు బాధల కేమి విరుగుడు మందు? పచ్చ పువ్వు వూదేనా! నవ సాగరముతోడ తడి సున్నమూను అరచేతిలో కలిపి ఆరార రాయంగ కొండ విషయము చూడ కొండెక్కుతుంది ఏడుపుల పాపాయి ఎగిరి గంతేయు ఈ చిట్కా వైద్యం బాల గేయాలో తల్లులకు అప్పగించే ఒక ప్రయత్నం కావచ్చును. ఇలాగే నాన్సెన్స్ గేయాలుతో పదాడంబరాలతో పాటుచిట్కా వైద్యం. ఇది బాలసాహిత్య శిల్పులకు ఒక ఉదాహరణ మాత్రమే. ఆ రోజుల్లో మసూచి మహమ్మారి వచ్చినప్పుడు వేప పసుపు కలిపి వైద్యం చేసే చిట్కా పాటలు ఉండేవి. అలాగే నీటి పరిశుభ్రత కాలుష్య నివారణ పై అనేక బాలగేయాలు ఉండేది. అయితే వీటి గురించి చెప్పుకునే టప్పుడు, పద్యాల గురించి కూడా కొంత పర్యావలోకనం చేసుకోవడం చాలా అవసరం. (సశేషం)- బెహరా ఉమామహేశ్వరరావు (పార్వతీపురం) సెల్ నెంబర్ :9290061336


కామెంట్‌లు