..మధుర స్మృతులు... గిర్రున తిరిగిన కాలచక్రంతో పాటు పరిగెత్తిన పసితనపు తీపిగురుతులు... కోటి కాంతులకిరణాలతో కోడికూతలతో... పైరగాలిపలకరింపులతో వీచే మట్టివాసనల పలవరింతలతో మనసు పులకరించిపోయేది.. నేస్తాల కాకి ఎంగిలి తినుబండారాలతో... గురుగులముంతలలో వచ్చీరానివంటలతో.. పచ్చని పొలాల వెంట పచ్చని బంతులమధ్య నవ్వుల ఆటలపాటలతో.. అపుడపుడు నేస్తాల అలకలతో.. పొద్దంతా పోటాపోటి చదువులతో రాత్రయ్యేవేళ గుళ్ళో భజనలతో పున్నమివెన్నెలలో సరదా కోలాటాలతో... మారాంచేసిన వేళ కొసరికొసరి తినిపించే అమ్మగోరుముద్దలతో.. కల్మషంలేని స్నేహాలతో కలతలేని..,పీడకలలురాని నిద్రలతో ఎంతహాయిగా గడిచిపోయిందో నా బాల్యం... తలుచుకుంటే అవన్నీ మధురస్మృతులే.... కాలమా... ఒక్కసారి వెనక్కిమరలు.. ఏరుకోవాలెన్నో మధురస్మృతులు... N.అపర్ఙఙ్యోతి.


కామెంట్‌లు