సుమతీ శతకం ౪౯వ పద్యం. తన యూరి తపసి తనమును దన పుతృని విద్యపెంపుఁ దన సతి రూపున్ దన పెరటిచెట్టు మందును మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .... తన వూరిలో ఉన్నవారి తపోనిష్ఠ గురించి, కుమారుని సద్గుణముల గురించి, తన భార్య అందము, గుణగణాలను, తన ఇంటి వైద్య విధులను, పౌరులందరికీ తెలిసేటట్టుగా ఎవరూ చెప్పరు.......... ....అని సుమతీ శతకకారుని వాక్కు. పై విధంగా, చెప్పుకోవడం వల్ల స్వాతిశయము/గర్వం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదీ కాక, *నరదృష్టి సోకడం* అనే నానుడి కూడా వుంది కదా. ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు