ఆబాల గోపాలాన్ని అలరించే "బాలకిరణాలు"---కయ్యూరు బాలసుబ్రమణ్యం రచించిన కవితా సంపుటి "బాల కిరణాలు " ఆబాల గోపాలాన్నిఅలరిస్తుందనడంలో సందేహం లేదు.అందరికి అర్థమయ్యే రీతిలో చాలా సరళమైన వచనంలో ఆయన కవితలను రాసారు. ఈ సంపుటిలోసమాజంలో నేటి పరిస్దితులలో ఉన్న అన్ని సమస్యలను ప్రస్తావించారు. 'రేపటి పౌరులు' కవితలోబాలలు ఏమిచేస్తారో చెప్పారు. 'గురువులకు వందనం ' లో గురువులపై తన అభిమానాన్ని చాటి చెప్పారు. నరకకుమా చెట్లు ..వేయకుమా ప్లాట్లు.. పడకుమా పాట్లు అంటూ 'మన బాధ్యతను గుర్తిద్థాం 'అంటూ ఆవేదనను వ్యక్తం చేసారు.భారత్ వెలుగుతోంది అంటూ దేశం పై ఉన్న దేశ భక్తిని తెలియ చేసారు. 'సుజల యజ్ఞం ' కవితలో నీటిప్రాముఖ్యతను వివరించారు. 'ఓటరూ మేలుకో 'అంటూ ఓటు యొక్క విలువలను ఉద్ఘాటించారు.'అమ్మ ఋణం తీర్చుకుందాం "అంటూ అమ్మనిఅశ్రద్ద చేయొద్దని తెలియచేసారు. 'మన బడి పిలుస్తోంది' కవితలో ప్రభుత్వ బడిలో చదివితే కలిగే లాభాలు గురించి ఆలోచనాత్మకంగా విశ్లేషించారు. 'విప్లవం' కవితలో కర్షకకార్మిక ,రైతు ,వెతలని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కవితల్లో సామాజిక స్పృహ , సమాజానికి ఏదో చేయాలన్నతపన మెండుగా కనిపిస్తుంది. ప్రతి కవిత ఆలోచనాత్మకంగా ఉంటుంది.ఆయన కవిగానే కాక ఉపాధ్యాయుడుగా ,గాయకుడిగా ,మిమిక్రీ కళాకారుడి గా బహు ముఖ ప్రజ్ఞ కనబరుస్తూ సమాజానికి తనవంతు సేవలను అందిస్తూ అనేక అవార్డులను తీసుకుంటూ అందరికి ఆదర్శమవుతున్నారు.మరిన్ని కవితా సంపుటీలు ఆయన కలంనుండి జాలువారాలని అందరి మన్ననలు పొందాలని ఆశిద్దాం.


కామెంట్‌లు