తొందరపాటు తగదు. అమరావతి నగరంలో తనయింటి అరుగుపై నీతికథ వినడానికి చేరిన పిల్లలు అందరికి మిఠాయీలు పంచినబామ్మ' బాలలు ఈరోజు మీకు తొందరపాటు ఎటువంటి అనార్ధాలకు దారితీస్తుందో తెలిపేకథ చెపుతాను. కష్టపడి న్యాయపరంగా సంపాదించిన ధనం మనోబలాన్ని,తనపై తనకున్న నమ్మకాన్ని,సంతృప్తిని,సమాజంలో గౌరవాన్ని ఆపాదించి పెడుతుంది. అక్రమార్గాన సంపాదిస్తే అనుక్షణం భయం తోకూడిన దుర్బర జీవితం,సమాజపరంగా చిన్నచూపు మన మనసుకు మనమే సమాధానం చెప్పుకోలేని పరిస్ధితి ఏర్పడుతుంది. పూర్వం శివయ్య అనే దినసరి కూలి ఉండేవాడు.దొరికిన రోజున కూలి పనికి వెళుతూ ఏపని దొరకని రోజున, అడవికివెళ్లి ఎండుకట్టెలు కొట్టి వాటిని నగరంలో అమ్మి జీవిస్తూ ఉండేవాడు. ఓకరోజు అడవిలో ఎండుకట్టెలు సేకరిస్తూ ఉండగా 'కాపాడండి'అన్న ఆర్తనాదం విని పించడంతో,ఆదిశగా చేతిలోని గొడ్డలితో ఆదిశగా పరుగు తీసాడు. అక్కడ గాయలతోఉన్న యోగి పులితో పెనుగు లాడు తున్నాడు. చేతిలోని గొడ్డలితో పులిని గాయపరిచాడు శివయ్య,బాధతో గాండ్రిస్తూ అడవిలోనికి పరుగు తీసిందిపులి.గాయపడిన యోగి కి ఆకు పసర్లు పూసి తన తల గుడ్డచింపి గాయాలకు కట్లు కట్టాడు శివయ్య. 'నాయనా నాప్రాణాలు రక్షించావు ఇదిగో మంత్రమణి నువ్వు ఏదైనా కోరుకుని దీన్ని అరచేతిలో ఉంచుకుని గుప్పిట బిగి స్తే నీకోరిక నెరవేరుతుంది కాని ఇది ఒక పర్యాయం మాత్రమే పని చేస్తుంది'అనిచెప్పి మంత్రమణి శివయ్యకు ఇచ్చి వెళ్లాడు యోగి. మంత్రమణి తో ఇల్లు చేరిన శివయ్య జరిగిన విషయం అంతా తన భార్య ఉమకు చెప్పడు.అత్యాశ పరురాలైన ఆమె'అలాగైతే ఏడు వారాల నగలు,పట్టు చీరెలు,లక్షబంగారు వరహాలు కోరుకుందాం!'అన్నది.'వాటివలన దొంగల దృష్టిలో పడతాం మన ప్రాణాలకే ముప్పు'అన్నాడు శివయ్య.'అయితే వాటిని మనల్ని కాపలా కాసేవారినికూడా కోరుకుందాం'అన్నది ఉమా.'కాపలా దారులకే మన సోమ్ముపై ఆశకలిగి తే'అన్నాడు శివయ్య సందేహంగా.'మీదిమరి విడ్డూరం మనుషులపై నమ్మకం లేకపోతే రెండు పిశాచాలను కావలికి కోరండి వాటికి ధనం పైన ఆశ ఉండదుగా'అన్నది ఉమ.'అవును అదే మంచిపని'అంటూ ఆవేశంగా మంత్రమణిని గుప్టిట బిగిస్తూ 'మా ఇంటికి మాఇద్దరికి రెండు పిశాచాలు కావలి కావాలి'అన్నాడు. క్షణంలో రెండు పిశాచాలు ప్రత్యక్షమయ్యయి. తొందరపాటు తో ముందుగా ధనంకోరుకోకుండా అనాలోచనతో పిశాచాలను కోరుకున్నందుకు చింతిస్తూ ఆరోజు నుండి తమతో పాటు వాటికి ఆహారం సంపాదించి పెట్టసాగాడు.ఆవిషయం తెలుసుకున్న గ్రామప్రజలు శివయ్య ఇంటి పక్కకు రావడం మానివేసారు. బాలలు ఆవేశం అనార్ధాలకు దారితీస్తుంది అని తెలుసు కున్నారుకదా! ఏవిషయమైనా ఆలోచించి నిర్ణంయం తీసుకోవాలి'అన్నది బామ్మ. బుద్దిగా తలఊపారుబాలలంతా.
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం : - S. అన్విక -7వ తరగతి-జి.ప.ఉ.పా.తొగుట.మండలం తోగుట-జిల్లా సిద్దిపేట
• T. VEDANTA SURY

చిత్రం : -M.దీక్షిత -8వ తరగతి -జి.ఉ.పా.తొగుట--సిద్దిపేట జిల్లా
• T. VEDANTA SURY

ఎదురుచూపు!!:-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం
• T. VEDANTA SURY

నా వేసవి మధుర జ్ఞాపకాలు:- వి.సింధు శ్రీ-9వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాల ఘణపురం మండలం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి