మన తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగిన కవి రావిపాటి తిప్పన్న. ఈ తిప్పన్ననే త్రిపురాం తకుడు అని కూడ అంటారు. ఈయన రాసిన గ్రంథములలో త్రిపురాంతకోదాహరణము ముఖ్యమైనది. ఒక్కొక్క విభక్త్యంతమున ఒక్కొక్క పద్యం గలదై ప్రతి పద్యము తర్వాత నొక్కొక్క కలళిక ను దాని తర్వాత ఒక్కొక్క యుత్కళిక గల గ్రంథము ఉదాహరణ అని చెప్పబడును. ఆ కాలంలో ఇటువంటి గ్రంథములే ఉన్నవని తెలియుచున్నది. అట్టి గ్రంధములే ప్రబలముగా ఉండేవి.వాటినే ప్రజలు ఆదరించే వారు.నన్నయాదులు భారతాది మహాకావ్యములను రచించడం ప్రారంభించిన తర్వాత ఈ లఘు కావ్యములు మూల పడినవి. అయినా త్రిపురాంతకుడు, శేష నార్యుడు మొదలైనవారు కొందరు అప్పుడప్పుడు ఉదాహరణకు గ్రంధములను సహితము వ్రాయుచు వచ్చిరి. తిప్పన్న ఈ ఉదహరణ గ్రంథములేగాక మదన విజయం, చంద్ర తారావళి, అంబికా శతకము కూడా రచించాడు. ఈ కవి కాలాదులను నిర్ధారణ చేయుటకు తగిన ఆధారములు అంతగా కనబడుటలేదు.అప్పకవి యతి ప్రాసప్రకరణమైన మూడవ ఆశ్వాసమున అప్పకవి యముననుస్వార సంబంధ యతి ఉదాహరణముగా రావిపాటి తిప్పన్నచాటుధార అనే ఈ క్రింది పద్యం మనకు ఉదహరించి యున్నాడు.మ: సరి బేసై రిపు డేలా భాస్కరులు భాషా నాధ పుత్ర వసుం/ధర యందొక్కొడు మంత్రి యయ్యే వినుకొండ న్రమయామాత్యభా/స్కరుడో యౌ నయినన్ సహస్ర శాఖ ల్లే వాలే యున్నవే/తిరమైదానము చేయుచో రిపుల హేతిన్ వ్రేయుచో వ్రాయుచోన్// ద్వాత్రింశన్మంత్రుల చరిత్రములు రాయని భాస్కరుని కథయందు దహరించబడిన ఈ పద్యమున రామయ్యమాత్య భాస్కరుని కథయం దుదహరించుటకు మారుగా రాయనా భాస్కరుడని యున్నది. సీ: నిర్మించెనే మంత్రి నిరుపమ ప్రాకార నవకంబుగా గోపీనాథ పురము/ గెలిచినా డే మంత్రి లలిత వి క్రమమున బ్రబలుడై రవనుల బలము నెల్ల నిలిపి నామడే మంత్రి నియత వైభవమున/గోపికా వల్లభు గూర్మి వెలయ/ పాలించే నేమంత్రి ప్రకటధర్మ ఖ్యాతి మహిమ మీర గా నాంధ్ర మండలంబు// నాతడు భూపాల మంత్రీన్ ద్ర సతతవినుత/ధీవిశారదు డచ్యుత దేవరాయ/మాన్య హిత వర్ధనుడు శౌర్య మహిత యశుడు/ భానుతేజున్డు రామయ భాస్కరుండు//అని కొండవీటి గోపినాధ స్వామివారి ఆలయ ముఖ ద్వారం శాఖయందు వ్రాయబడియున్నదీ పద్యము. దీనిని బట్టి రామయ్య భాస్కరుడు అచ్యుత దేవరాయల కాలంలో ఉండుననుట స్పష్టమవుతుంది. ఈ చాటువు (కలయ బసండి ఘంటమున....)ఆధారము చేసికొనే వీరేశలింగం పంతులు గారు తిప్పన చాటుదారలో వర్ణితుడైన రాయన భాస్కరు డితడేయని నిర్ణయించి త్రిపురాంతకుడి కాలము క్రీ.శ. 1380 ప్రాంతమని అభిప్రాయపడ్డారు.ఇచట పద్యాలలో కలం గురించి ఉంది కాని ఖడ్గం గురించి లేదు. అందువల్ల త్రిపురాంతకం వర్ణించిన భాస్కరుడు రాయన భాస్కరుడు కాదు. అంతేకాక క్రీ.శ. 1380 వరకు అనుమానమే మా రెడ్డి రాజ్యం చేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటే త్రిపురాంతకం శ్రీనాథుడు కాలం వాడు అవుతాడు. కానీ అతనే కవిత్వం శ్రీనాధునికి ముందు కాలం అనిపిస్తుంది.ఏది ఏమైనా రావిపాటి తిప్పన్న అనే ఈ కవి త్రిపురాంతకుని యొక్క నిర్దిష్టమైన కాల నిర్ణయము చేయలేక పోతున్నాము.ఈ కవిచే విరచింపబడిన పద్యాలు:చంద్రతారావళి చరమక్ష్మాధరచారు సింహముఖదం కోటియో నాగ నం బరశార్దూలనఖంటొ నాగఁ దిమిరేభప్రస్థురద్దర్వసం హరణక్రూరతరాంకుశం బనఁగ నుద్యల్లీల నీరేఖ ని త్యరుచిం బొల్పగుఁ బెంపగున్ విదియచంద్రా రోహిణీవల్లభా.మ.అమితధ్వాంతతమాలవల్లిలవనవ్యాపారపారీణదా/ త్రమొ సౌగంధిక షండ కుట్మల కుటీరాజీ సముదాటన/ క్రమ నిర్యాణధురీణకుంచికయొ నాఁగం బెంపునన్ నీకళా/ రమణీయత్వము చూడ నొప్పెసఁగుఁ జంద్రా రోహిణీవల్లభా.//మ. రతినాథుం డనుమాయజోగి చదలం దైలోక్యవశ్యాంజనం/ బతియత్నంబునం గూర్చి మౌక్తికమయం బై యున్న ప్రాతంబునన్/ మతకం బేర్పడం బెట్టి దాఁచె నన నీ మధ్యంబున మచ్చ నం/ తతముం గన్నులపండు వై వెలయుఁ జంద్రా రోహిణీవల్లభా//,అంబికాశతకము ఉ. రెప్పల బోరుఁదల్పు లిసిరంతలు వారెడు చూపుఁగుంచియం/ ద్రిప్పి తళుక్కనం దెఱచి తియ్యని మోమునఁ గాయు వెన్నెలల్/ ముప్పిరిగొన్న వేడుకలు మూఁగినసి గ్గసియా డఁ బ్రీతి నీ/ వప్పరమేశుఁ జూచి తను వర్ధము గొంటి పొసంగ నంబికా / చ:బేడఁగగురత్నదర్పణముఁ బేరినవెన్నెల పోసి నిచ్చలుం,/ దుడువక పాలసంద్రమునఁ దోచి సుధాకర్ మేనికందు పోఁ /గడుగక నేరెటేట సితకంజము ముంపక నైజకాంతి యై/ తొడరినఁ దల్లి నీ మొగముతో సరిపోల్పఁగఁ జాలు నంబికా.ఉ:కూడెడి వెండ్రుకల్ నిడుదకూఁకటి బ్రోవఁగ బొడ్డు పై వళుల్ /జాడలు దోపఁగ్రొటమ్మొలక చన్నులు మించు దొలంక సిగ్గునం/ జూడఁగా నేరముల్ మెఱఁగుఁజూపుల నీన హిమాద్రియింట నీ/ వాడుట శూలికిన్ మనము వాడుట గాదె తలంప నంబికా//,సుమారు ఎనిమిది శతాబ్దాల క్రిందట రాసిన చంద్ర తారావళి, అంబికాశతకము లోని పద్యాలు నేటికీ నిలుచుట విశేషము కదా! ఇదే మన తెలుగు సాహిత్యము, మన తెలుగు వారు చేసుకున్న అదృష్టము. ( ఇది 44వ భాగం ) -బెహరా ఉమామహేశ్వరరావుసెల్ నెంబర్: 9290061336


కామెంట్‌లు