త్యాగధనుడు ..,. కడుపులో దయవుంచి కండ్లతో బెదరించి బ్రతుకు బాట నేర్పువాడు నాన్న సంసార బారము సదా మోస్తూ ఇంటిల్లిపాదికి ఏమి తక్కువ బడకుండ ఎద్దువోలె పొద్దస్తమానం పనిచేస్తాడు భార్య పిల్లల కోరికలు తీర్చెడి కల్పవృక్షం నమ్మిన వారికి వమ్ము చేయని ఘనుడు ఆపదలెన్ని వచ్చిన ఆత్మస్థైర్యము వదలడు కన్నుల వెనుక కన్నీళ్లు ఎన్ని దాగివున్న కలతలు ఏవి నాలో లేవని కళకళలాడె కన్నులు చూపుతాడు తనకంటూ ఏది దాచుకోక తనవారికి పంచిపెట్టు త్యాగధనుడు నాన్న కన్నకడుపు తీపి తెలసి కష్టాలు పడుతాడు తనవారికి కష్టం రాకుండా చూస్తాడు తల్లి తండ్రుల తోబుట్టువుల నాదరిస్తు ఇల్లాలితో సామరస్యంగా మెదులుతాడు తులాబారం తలకు మించిన పనియైన తప్పటడుగులు పడకుండ పాట్లుపడతాడు సంసార మందు రాటుతేలుతాడు నాన్న ..జాధవ్ పుండలిక్ రావు పాటిల్ చరవాణి..9441333315


కామెంట్‌లు