పట్టువిడుపులు:--వంకాయ మెక్కలతో స్వల్పకాలంలోనే ఫలితం పొందవచ్చు. చెరకు నుంచి లబ్ధిపొందాలంటే చాలాకాలం ఆగక తప్పదు. వక్క చెట్లకు కొన్నేళ్ళు పడితే టేకు చెట్లనుంచి ప్రయోజనం పొందాలంటే అత్యధిక సంవత్సరాలు నిరీక్షించాలి. వక్క నమిలి ఉమ్మడానికీ టేకు వినియోగానికీ మధ్య ఎంతో తేడా ఉంది. టేకులా గట్టి మేలు పొందాలంటే ఎంతలా ఓపికపట్టాలో ఆలోచించాలి.ఒకరి హృదయంలో సుస్థిరం స్థానం సంపాదించాలంటే పట్టువిడుపులుండాలి. ఎవరైనాసరే ఓర్పుతో నిరీక్షించాలి. - జయా


కామెంట్‌లు