మంత్రాలకు చింతకాయలు రాలవు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.:--అమరావతి నగరంలొ సుగుణమ్మ అనే వితంతువు రెండు పాడి పసువులు తొ వచ్చినపాలు అమ్ముతూ, పదవ తరగతి చదివే రాము అనే తన కుమారునితొ నివశిస్తూ ఉండేది. ఒక రోజు అంగడి లొ నిత్యవసర సరుకులు కొంటూ ఉంటే,పెద్ద విభూధి రేఖలు ధరించిన వ్యెక్తి సుగుణమ్మ వద్దకు వచ్చి'తల్లి నీయింటికి నరదిష్టి ఉంది నేను ఉచితంగా పూజచేస్తాను చూడు'అన్నాడు. అతనిమాటలు విని భయపడిన సుగుణమ్మ అతన్ని తనయింటికి తీసుకువెళ్లింది. ఇంటి మధ్యభాగంలో పెద్దముగ్గు వేసి,దానిమధ్యన తన చేతిసంచిలో నుండి తీసిన టెంకాయ ఉంచి,దానిపై పసుపు,కుంకుమ పువ్వులు చల్లి'అమ్మా ఒక నిమ్మపండు తీసుకురండి'అన్నాడు. నిమ్మపండు అందించింది సుగుణమ. తన చేతిసంచి లోనుండి చిన్న కత్తిని తీసిన ఆవ్యక్తి'అమ్మా నరదిష్టి ఉంటే నేను కోస్తూన్న నిమ్మపండు రెండు చక్కలు రక్తంలా మారిపోతాయి. మంత్రించిన నీళ్లు ఈ టెంకాయపై చల్లిన వెంటనే పగిలి పోతుంది,నమ్మకం కుదిరితే రెండువేలు ఇవ్వు'అని సుగుణమ్మ సమాధానం కొరకు ఎదురు చూడకుండా, తనచేతిలోని కత్తితో సుగుణమ్మ ఇచ్చిన నిమ్మపండును కోసాడు,ఆ నిమ్మపండు రెండు చక్కలు ఎర్రగా రక్త వర్ణంలో కనిపించాయి.అది చూసిన సుగుణమ్మ భయపడింది.'అమ్మాభయపడక నీయింటి నరదిష్టి ఎలావదిలిపోతుందో చూడు'అని అక్కడ ఉన్న లోటాలోని నీళ్లు తనచేతిలోనికి తీసుకుని ఎవేవో మంత్రాలు చదువుతూ చేతిలోనినీళ్లు ముగ్గు మధ్యలో ఉంచిన టెంకాయ పై చల్లాడు. క్షణకాలం అనంతరం టెంకాయ పట్ మని శభ్ధం చేస్తు ముక్కలు అయింది. అదిచూసిన సుగుణమ్మ భయంతో వణికిపోసాగింది.'అమ్మా నీయింటి నరదిష్టి వదిలిపోయింది'అన్నాడు పూజ చేసిన వ్యక్తి.అప్పుడే పాఠశాలనుండి వచ్చిన తన కుమారుడు రామానికి జరిగిన విషయం అంతా చెప్పింది.అంతావిన్న రామం,వంటగదిలోనికి వెళ్లి ఒకనిమ్మపండు,టెంకాయ,కత్తితొ వచ్చి'అయ్య ఇదిగో ఈ నిమ్మపండును మాఇంటి కత్తితొ కోసి ఎర్రగా మారేలా చూపించండి,అలాగే నేను ఇచ్చిన టెంకాయను మీమంత్రజలంతో పగులకొట్టండి'అన్నాడు. రామం మాటలకు తెల్లబోయాడు ఆపూజ చేసినవ్యక్తి. పత్తికాయరసం పూసి ఆరబెట్టిన కత్తితో నిమ్మపండు కోస్తే రక్త వర్ణంలోనికిమారుతుంది.సున్నం నీటిలో నానబెట్టి, ఎండబెట్టిన టెంకాయపై నీళ్లు చల్లితే పగిలిపోతుంది.ఈపని చేయడానికి ఎటువంటి మంత్రాలు అవసరంలేదు,ఇది మాసైన్సు పంతులుగారు చెప్పారు.మంత్రాలకు చింతకాయలు రాలవు.మంత్రాలన్ని మన లోకకల్యాణానికే కాని క్షుద్రపూజలకుకాదు.వయసులో ఉన్న మీరు కష్టపడకుండా అమాయకులను మోసగించడం తప్పు,చట్టరీత్య నేరం.మరెప్పుడూ ఎక్కడా ఇటువంటి తప్పుడు పనులు చేయకండి వెళ్లండి'అన్నాడురామం.'అమ్మా మన్నించండి చిన్నవాడు అయినా నీబిడ్డ తెలివైనవాడు.నేను ఎప్పుడు ఇటువంటి మోసాలకు పాల్పడను'అని అక్కడ ఉన్నవి అన్ని తన చేతి సంచిలొ వేసుకుని బయలుదేరాడు.'నాయనా నీలొ మార్పు వచ్చినందుకు సంతోషం,ఇదిగో ఈడబ్బు తీసుకుని వెళ్లి భోజంనం చేసివెళ్లు'అని వందరూపాయలు అతని చేతిలో ఉంచిందిసుగుణమ్మ.చేతులు జోడించిన ఆవ్యక్తి వెళుతూ,తన చేతిసంచిని చెత్తకుండి లో వేయడం గమనించిన సుగుణమ్మ రామాన్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంది.


కామెంట్‌లు