నా ప్రియమైన మొలక మిత్రులారా.శుభోదయం.ఈరోజు నేను మీకు ఒక సంఘటన గురించి చెబుతాను.పీవీ తాత వరంగల్లో హైస్కూలు చదువు చదివారు అని మనకు తెలుసు కదా.ఆయన ఎనిమిదో తరగతిచదువుతున్నప్పుడు ఒక సంఘటనజరిగింది.ఒకరోజు ఇంగ్లీషు క్లాస్ జరుగుతుంది.ఒక ఆంగ్ల కవిత గురించి బోధించాలను కున్నాడు ఆంగ్ల ఉపాద్యాయుడు.అందరినీ పాఠ్య పుస్తకం తీయమని చెప్పారు మాస్టారు.అందరూ తీసారు కానీ ఒక విద్యార్థి పుస్తకం ఇంట్లో నే మరచి పోయి వచ్చాడు.అది తెలిసిన టీచర్ ఆ విద్యార్థిని బెంచి పై నిలబడమని చెప్పారు.అప్పుడు పీవీ గారుతన పుస్తకం ఆ విద్యార్థికి ఇచ్చినాడు.అది గమనించిన పంతులు గారు ఏం నీ పుస్తకం ఇస్తున్నావు.అతనికి బదులుగా నీవు బెంచ్ పై నిలబడుతావా.అని కోపంగా అడిగాడు. దానికి పీవీ లేదు సార్.నాకు ఆ ఆంగ్ల కవిత నోటికి వచ్చు నని జవాబు చెప్పారు.దానికి ఆ ఉపాద్యాయుడు నేను ఇంకా చెప్ప నే లేదు నీకు నోటికి ఎలా వస్తుంది.అని అడిగాడు.అయ్యా.దానిని నేను నిన్నరాత్రి ఇంట్లో చదువుకున్నాను.నాకు నోటికి వచ్చేసింది.అన్నారు పీవీ.అయితే ఇప్పుడు చదువు.అని అడిగాడు సారు.పీవీ మొత్తం కవితను చెప్పారు.అది విన్న ఆ మాస్టరు ఆశ్చర్యంతో ఉండిపోయారు.పీవీ తాత ను మెచ్చుకొన్నారు.అతనికి తన కలం బహుమతిగా ఇచ్చారు.పీవీ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.కారణ జన్ములు వాళ్లు.మీరు కూడా ప్రతిరోజు రేపు క్లాస్ లో చెప్పే పాఠం ఈరోజు సాయంత్రం చదువుకుంటే మీరుకూడా అలా తయారు కావచ్చు.పట్టుదల ,ప్రయత్నం ఉంటే మనిషికి అసాధ్యం అంటూ ఉండదు.తెలిసిందా.రేపు మరో ముచ్చటసెలవు తీసుకుంటున్నాడు మీ సంతోష్ బాబు మామయ్య.


కామెంట్‌లు