49.చైనాతో యుద్ధ జ్ఞాపకాలు:--కథ రాయాలని కూర్చున్నాను.ఏవేవో ఆలోచనలుచుట్టుముట్టు తున్నాయి. నేను 6వతరగతి చదివినప్పుడు జరిగిన విషయం హఠాత్తుగా గుర్తువచ్చింది. అవి భారతదేశం పై దండయాత్రచేస్తున్న రోజులు. ఏ నోట వినినా యుద్ధ వార్తలే! జానపద సినిమాలు చూసిన ప్రభావమేమో!నేను ఆ దేశ ప్రధాని ఈ దేశ ప్రధాని యుద్ధం చేస్తారనుకున్నాను!చౌ ఎన్ లై కంటే మన నెహ్రూ బలవంతుడేనా అని నాన్న గారిని అడిగాను.నాన్న గారు ఆశ్చర్యంగా చూశారు.మరి మనంగెలవాలి కదా అన్నాను.నా మనసులోనిది నాన్నగారు గ్రహించారు.అప్పుడు నవ్వుతూ ఆయనపూర్వకాలంలో రాజులు యుద్ధాలు చేసేవారు. ఇప్పుడు రాజులు లేరు. రాజ్యాలు లేవు.ఇప్పుడుప్రజలే ఎన్నికల్లో ఓటు వేసి ప్రభుత్వాలు ఏర్పాటుచేసుకుంటున్నారు. చైనా దేశ సైన్యం మన దేశసైన్యం తుపాకీలతో యుద్ధం చేస్తారు.ప్రధానులుచెయ్యరని చెప్పారు. నా సందేహం తీరింది.స్కూల్ కి వెళ్ళాను.తరగతి లో మా తరగతి ఉపాధ్యాయులు మరల సుబ్బారావు మాష్టారుచైనా యుద్ధం గురించి చెప్పారు. మనమంతామన భారత సైన్యానికి సహాయపడాలన్నారు.యుద్ధ సహాయ నిధికి విరాళం పంపాలన్నారు.అందుకు ఒక సూచన చేశారు." మీ ఇంట్లో వంటప్రారంభించేటప్పుడు ఒక చేరెడు బియ్యం రోజూ వేరేగ ఉంచమని చెప్పి వారం రోజుల కొకసారిస్కూలుకు తీసుకుని రండి.ఆ బియ్యం అమ్మగావచ్చిన డబ్బును యుద్ధనిధికి మని ఆర్డర్ చేద్దాం."అన్నారు. విద్యార్థులమంతా మాష్టారు చెప్పినట్లేచేశాం.విద్యార్థులు తెచ్చిన బియ్యం ఎవరో ఒకటీచరు కొనేవారు.ఆ రోజుల్లో పది రూపాయలువచ్చేది.ఎం.ఓ. ఫారం నింపి పోస్ట్ ఆఫీసులో మా చేతే ఆ డబ్బులు కట్టించేవారు.ఆనాటి విషయాలుగుర్తు తెచ్చుకొని "త్యాగం" అనే కథను రాశాను.సూక్ష్మంగా కథ చెప్పడానికి ప్రయత్నిస్తాను.చైనాతో మనకు యుద్ధం జరుగుతున్న రోజులు!యుద్ధ సహాయ నిధికి ప్రభుత్వం విరాళాలు కోరింది. ప్రజలు బంగారంరూపంలోను ధనరూపంలోను విరాళాలిచ్చి తమదేశభక్తిని చాటుకున్నారు. చమన్ లాల్ అనేకోటీశ్వరుడు మాత్రం ఒక రూపాయి కూడా విరాళంగా ఇవ్వలేదు. వస్తువులకు కృత్రిమ కరువుసృష్టించి అక్రమార్జన చేస్తుండే వాడు.ప్రజలు అతనిగూర్చి చులకనగా మాట్లాడుతుండేవారు.చమన్ లాల్ కి పదేళ్ల కూతురుంది.ఆమె పేరు గీత.తండ్రి గురించి ప్రజలు చులకనగా మాట్లాడడంవిని బాధ పడేది.తండ్రికి విరాళం ప్రకటించండనిచెప్పే ధైర్యం లేదు.జేబుఖర్చు కోసం తండ్రి ఇచ్చిన డబ్బులనే దాచి ప్రతి పదిహేను రోజులకు క్లాస్ టీచర్ సహాయం తో యుద్ధసహాయనిధికి మనిఆర్డర్ చేసేది.ఒక రోజు గీత చేతిలోని డబ్బులున్న కవరు తండ్రి దృష్టిలో పడింది. ఏమిటది అనిఅడిగాడు. "మీరిచ్చే చిల్లర డబ్బులు. యుద్ధనిధికిపంపుతున్నాను." ధైర్యం చేసి అంది.చమన్ లాల్కి కోపం వచ్చింది. "ఈ పాడు బుద్ధి ఎవరు నేర్పారు?"హూంకరించాడు."నా కెవరూ నేర్పలేదు. నేనే తెలుసు కున్నాను.మన దేశం ఓడిపోతేచైనా పాలిస్తాది.మన సంపదలు వాళ్ళవి అయిపోతాయి.ఆ ప్రమాదం రాకుండా అందరు యుద్ధనిధికి సాయం చేస్తున్నారు మీరు తప్పించి!"అని స్కూలుకు వెళిపోయింది.చమన్ లాల్ కి మతి పోయినంత పనయింది.కూతురు చేసిన బోధన పని చేసింది.గదిలోకి వెళ్ళి లక్ష రూపాయలు చెక్ రాసి యుద్ధ సహాయనిధికి పంపించాడు.తండ్రి చేసిన పని తెలిసి గీత మామంచి నాన్న అని తండ్రిని వాటేసుకుంది. కథ బాలచంద్రిక లో 1985 జనవరి సంచికలోపడింది. మన జీవితాను భవాలు, లోకానుభవాలుమననం చేసినప్పుడు కొత్త కథలు పుడుతుంటాయి.అలాంటి జ్ఞాపకాల పొరల నుంచిపుట్టిందే ఈ త్యాగం కథ! 1985 లో బాలరంజని,బాలమిత్ర,శుభోదయ పత్రికలలో మరికొన్ని కథలు వచ్చాయి.ఆంధ్రపత్రిక గ్రూపువారు పిల్లలు కోసం ప్రారంభించిన మాసపత్రికబాలరంజని. ఈ పత్రిక విశేషం ఏమిటంటే....సోమవారం కథను పోస్ట్ చేస్తే శుక్ర శని వారాల్లో ఒక కార్డు వచ్చేది. ఊదారంగు కార్డు కథ అంగీకరించామని తెలిపే కార్డు. తెలుపు కార్డయితేకథను అంగీకరించలేదని తెలిపే కార్డు.పోస్ట్ మేన్చేతిలోని కార్డు చూస్తే సరి మన కథ పరిస్థితి తేలిపోయేది!(సశేషం)--బెలగాం భీమేశ్వరరావు 9989537835


కామెంట్‌లు