50. ప్రకృతి ఒడిలో...--- వేసవి సెలవులు రాగానే మాదలంగి వెళ్లి చల్లని వాతావరణం లో కొన్ని రోజులు గడపడంఅలవాటయింది.1986 వేసవిలో ముగ్గురు పిల్లలతో అక్కడకు బయలుదేరాం.ఒక అబ్బాయి.ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయే ముందు పుట్టాడు.పేరు రాంప్రదీప్. నాన్నగారి పేరుగంగారాం లో "రాం" ఆ పేరులో చేర్చాం. పెద్దమ్మాయి గీతాకిరణ్మయి.భగవద్గీత మీద గలభక్తితో ఆ పేరు పెట్టాను. చిన్నమ్మాయి గాయత్రి.దసరా నాడు పుట్టింది.మాదలంగి ప్రయాణంఅందరికీ ఆనందదాయకమే!ఆ రోజు ఉదయాన్నే బయలుదేరాం.మా ఇంటి వద్దే ఉండి మా చినబావమరిది ఇంటర్ చదువుతున్నాడు.తనకు కూడా సెలవులే.మాతోనే బయలుదేరాడు. గుమడలో బస్ దిగాం. రాఘవ బస్ ఆగుతున్నదగ్గర నిలబడి ఉన్నాడు. రాఘవ నాలుగోబావమరిది.పిల్లలు మామయ్య దగ్గరకు పరుగెత్తారు.మాదలంగి నుంచి వచ్చిన పనిమనిషి కావడిలో రెండు వైపులా రెండు సూట్ కేసులురమేష్ పెట్టాడు.అందరం నడక ప్రారంభించాం. రమేష్, రాఘవ పిల్లలను ఎత్తుకున్నారుగుమడ ఊరు పక్క నున్న తోట నుంచి వెళ్తున్నాం.పనసచెట్టు కాండం నుంచి వేలాడుతున్న పెద్ద పెద్ద పనస పళ్లు కనిపించాయి. ప్రదీప్, గీత వాటిని వింతగా చూశారు.వాటిలోనేపనస తొనలుంటాయని పిల్లలకు చెప్పేం.పనసచెట్లు నుంచి కొద్ది సేపటికే ఏటి దగ్గరకు వచ్చేశాం.ఉదయం వేళ.తూర్పు నుంచి సూర్య కిరణాలునదిపై ఏటవాలుగా పడుతున్నాయి.ఏటి నీరుతళ తళ లాడుతూంది.అందమైన దృశ్యమది.ప్రదీప్, గీత లు ఏట్లో దిగడానికి వాళ్ల మామయ్య ల చేతుల నుంచి జారిపోడానికి చూస్తున్నారు."ఇక్కడ లోతు.దిగకండి.అవతల ఒడ్డున దిగుదురు." కేక వేయగానే ఆగిపోయారు. వేసవికాలం.ఎక్కువ నీరు లేదు.అవతలి ఒడ్డుకుచేరిపోయాం.అక్కడ నీటి లోతు అర అడుగు కూడా లేదు.పిల్లలిద్దరు నీట్లో దిగారు. వాళ్ళసరదా అంతా ఇంతా కాదు.నీటి మీద తప తపకొడుతూ ఆ ఇద్దరు సరదా పడి కేకలేస్తుంటే గాయత్రి కిందకి దిగిపోయి వాళ్ళతో ఆడడానికి ఉరకలేస్తుంది. గాయత్రి 9 నెలల పిల్ల. వాళ్ళమ్మనీటిలో దిగి గాయత్రి పాదాలను నీటిలో ముంచింది.అన్నయ్య, అక్క చేతులతో తపతప కొడుతూంటే గాయత్రి కాళ్ళతో నీటిలో తపతపకొట్టి భలే సరదా పడింది. ఎక్కడ నుంచో కోకిలపాట వినిపించింది.ఆకాశంలో ఎగురుతున్న కొంగలబారు కనిపించింది.దూరంగా జాలర్లువల విసురుతున్నారు.అవన్నీ చూపేసరికి పిల్లలఆట దృష్టి తగ్గింది. ఇంకా ఆలస్యమైతే ఎండముదురుతోంది.రాఘవ,రమేష్ లు పిల్లల్ని నీటి నుంచి బయటకు తెచ్చారు.ఇద్దరు పిల్లలు మెత్తటిఇసుకలో ఒకటే పరుగులు. పడిపోయినా నొప్పిలేదు .అందువల్ల తెగ రెచ్చిపోయారు.వాళ్ళకభలే వినోదంగా ఉంది. ఇసుక దారి పూర్తయింది.మట్టి దారికి వచ్చాం.ఎత్తుకోడానికి పిల్లలు చిక్కలేదు. పరుగు తీశారు. వాళ్ళలా పరుగెత్తుతుంటేతెల్లమొహంతో గాయత్రి వాళ్ళమ్మ వైపు చూసింది. పెద్దయితే నువ్వూ పరుగెత్తుదువులే అని వాళ్ళమ్మ నవ్వుతూ అంది.తొడిమ ఊరు దాటాం.పిల్లలు అలిసిపోయి నిలబడిపోయారు. పని మనిషి చూశాడు. ఇద్దరు పిల్లలను సూట్కేసుల మీద కూర్చుండబెట్టి కావడి భుజాన వేసుకున్నాడు.కావడి తాళ్ళు గట్టిగ పట్టుకోమన్నాడు.పిల్లలు తాళ్ళు పట్టుకున్నారు.పనిమనిషి హుషారుగా కూనిరాగాలు తీస్తూకావడితో అడుగులు వేసుకుపోతూంటే పిల్లలు పొందే ఆనందం చెప్పడానికి మాటలు చాలవు.మాకు వేడుకే చూపించారు. ఊరు దగ్గరకు రాగానేకావడి దిగి పోయి చెరువు గట్టు నుంచి ఊర్లోకిపరుగు తీశారు. అందరం ఇల్లు చేరాం.అత్తయ్యగారు, మామయ్య గారు పిల్లలను చూసి చాలాసరదా పడ్డారు. మామయ్య గారు ఉపాధ్యాయులు మాత్రమే కాదు.మంచి వైద్యులు.హోమియో ఆయుర్వేద పరీక్షలు కట్టి సర్టిఫికెట్లు కూడా పొందేరు.ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలుఆ ఊరి వాళ్ళు వైద్యం కోసం ఇంటికి వస్తుండేవారు.పేషెంట్లు రాలేని పరిస్థితులలో మామయ్యగారే ఆ ఊళ్ళు వెళ్ళే వారు.ఆయన వద్ద ఒకలైసెన్స్ తుపాకీ ఉండేది. వైద్య సేవలు నిమిత్తంరాత్రి వేళల్లో చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లినప్పుడు ఆత్మ రక్షణ నిమిత్తం డి.ఇ.ఓ.ఆఫీసుద్వారా ప్రభుత్వమే గన్ లైసెన్స్ మంజూరు చేసింది. ఆ రోజుల్లో గ్రామాల్లో వైద్య సౌకర్యాలుఅరకొరగ ఉండేవి. సాయంత్రం వేళ మామయ్యగారు బయట గ్రామాలకు వెళ్ళినప్పుడు నేనుఆయనతో వెళ్ళేవాడిని. దారిలో పచ్చదనం చూసి పరవశించి పోయేవాడిని. చెట్లు, పుట్టలు,రకరకాలపిట్టలు, పొదలు, తుప్పలు, అప్పుడప్పుడు దారికిఅడ్డం వచ్చే పాములు ఇవన్నీ నాకు ఆనందంకలిగించేవి.ఇక ఊళ్లోకి వెళ్ళీసరికి పల్లె వాసులమాటలు,వాళ్ళ పలకరింపులు,ఆప్యాయతలు,గౌరవమర్యాదలు ...ఇవన్నీ దగ్గరుండి చూసేఅవకాశం కలిగేది.వెన్నెల రాత్రుల్లో బయటమంచాలు వేసుకొని మాట్లాడుతూ ఉంటేసమయం మరిచిపోయేవారం. పిల్లలు విశాలమైనఆవరణలో ఆ వెన్నెల్లో అమ్మను ఆకలిని మరిచిపోయి తోటి పిల్లలతో ఆడుకోవడం నాకింకా గుర్తే.ఇటువంటివన్నీ నాకు బాలగేయ వస్తువులేఅయ్యాయి.(సశేషం)-- బెలగాం భీమేశ్వరరావు 9989537835


కామెంట్‌లు