సుమతీ శతకం పద్యం 74(౭౪) పరునాత్మఁ దలచు సతి విడు మరు మాటలు పలుకు సుతుల మన్నింపకుమీ వెర పెరుఁగని భటు నేలకు తరచుగ సతిఁ గవయబోకు తగదుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ..... ఇతరులను తన మనసులో నిలుపుకొన్న భార్యను విడువలెను. ఎదురు మాటలు మాట్లాడే కుడుకును దగ్గరకు తీసుకో రాదు. మనయందు భయంతో కూడిన గౌరవం లేని పనివానిని పనికి వుంచుకోకూడదు. మితి మీరిన భార్యా సంగమము కూడదు.... ......అని సుమతీ శతకకారుని వాక్కు. *అతి సర్వత్ర వర్జయేత్* .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు