నాన్న!!--కె ఎస్ అనంతాచార్య.-- తెల్లటి పంచె లాల్చీ కండువా నుదుట నామం నడయాడే దైవం సంస్కృతికి ప్రతిరూపo వేలు పట్టి ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్న చిరునామా నా అక్షర సంపద కోసం తాను ఎండలో మండి పోతూ నాకు నీడైన గొడుగు జాతక చక్రాన్ని మార్చడానికి సైకిలు పై కార్యోన్ముఖులై కదలి నన్ను వెలిగించి తాను కరిగిన కొవ్వొత్తి తన చేతులతో క్రమశిక్షణ కళ్లతో సంస్కారం పంచిన పెద్ద మనస్సు ద్వంద్వ వైఖరికి తావులేదు నిజాన్నీ నిర్ద్వంద్వంగా కుండబద్దలు చేసే నీర్భీతుడు అమ్మనాన్నలు ద్వంద సమాస మైనా నాన్నదెప్పుడూ ఏకవచన ప్రవచనమే తను తెరిచిన పుస్తకం కాదు రాసిన డైరీలో ప్రత్యక్షరం లో ఉపవాస ఉపాసననే తెలుపుతాయి కవనం కట్టి సాహిత్యం మేళవించి హార్మోనియం పై రాగాలు పండించిన జంట స్వరం కవనం నా వారసత్వం ఉపన్యాసం రూపాంతరం చెందిన నా వ్యాఖ్యానం గురువై జ్ఞాన బీజాలు నాటిన వాగ్దేవాతా ప్రతి రూపం వాత్సల్య నదీ ప్రవాహం నాన్న!


కామెంట్‌లు