నైతిక వికాస సూత్రాలు-1--- సాకి, రచయిత-కరీంనగర్.

1.
సత్యమును పలుకు సతతము
ధర్మమును పాటించు నిరతము
మనిషివై జీవిస్తు సాగిపొమ్ము
నల్గురి గుండెల్లో నిలిచిపొమ్ము
2.
తల్లిదండ్రుల సేవ మరువకు
పెద్దలపట్ల గౌరవం తగ్గించకు
అందరిపట్ల ప్రేమభావం ఉంచు
అందరికి స్నేహభావం పంచు
3.
భవిష్యత్తుకి సాధనం చదువు
శాశ్వతకీర్తికి సాధనం చదువు
చదువుతో సద్గుణాలు పెంచుకో
చదువుతో దుర్గుణాలు త్రుంచుకో
4.
దీనుల్ని దయతో సేవించాలి
పేదల్ని ప్రేమతో ఆదరించాలి
దయాగుణం మదిలో నింపుకో
ప్రేమగుణం గుండెల్లో నిలుపుకో
5.
దేశం ఉంటేనే సజీవము
దేశం లేకుండ నిర్జీవము
దేశం శాశ్వతమని తలచుకో
దేశకార్యం నీదిగా మలచుకో