తెలుగు సాహిత్యము- దసరా పండగ -బెహరా ఉమామహేశ్వరరావుసెల్ నెంబర్ :9290061336)పార్వతీపురం-535501

దసరా పండుగ  బాలసాహిత్యం                    తెలుగు సాహిత్యములో మన పండుగలకు పబ్బాలకు ఎంతో ప్రాముఖ్యమున్నది. ఈ పండుగలకు సంబంధించిన సాంప్రదాయాలతో 
పాటు, సాహిత్యం కూడా పెన వేసుకున్నది.
మన భారతదేశంలో సనాతనంగ పండుగలలో
ఏకత్వంలో భిన్నత్వం కనిపిస్తుంది. భారతీయుల
పండుగలు, దీపావళి, హోలీ పండుగ, శ్రావణ పౌర్ణమి (రాఖీ పండుగ), వినాయక చవితి, దసరా వంటి అనేక పండుగలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా జరుపుకునే సాంప్రదాయం మనకు కనబడుతుంది.
 పండుగ ఒక్కటే అయిన ఆచరణలో భిన్నత్వం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండగ
తెలంగాణలో బతుకమ్మ పండుగ, కేరళలో ఓనం పండుగ, కర్ణాటకలో దీపావళి, తమిళనాడులో ఉగాది పండుగ, ఒడిశాలో ఆశ్వయుజ పౌర్ణిమ గౌరీ పౌర్ణిమ  అత్యంత ప్రాముఖ్యత ఉంది. అలాగే ఉత్తరాది రాష్ట్రాలలో శ్రావణ పౌర్ణిమ (రాఖీ పండగ ) దీపావళి పండుగలు అధిక ప్రాముఖ్యతను సంత రించుకున్నాయి. సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించే ఈ పండుగలు అన్నీ కూడా
భారతదేశంలోని సకల జాతులు, భాషలు, ప్రాంతాలనే బేధం లేకుండా ఐక్యతగ జరుపు కుంటారు.  ఘనంగానే    భక్తిశ్రద్ధలతో   మహదానందంగా  జరుపుకుంటారు.
శ్రీరామనవమి, శ్రీ కృష్ణాష్టమి వంటి పర్వదినాలలో వాటి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ అనేక పురాణ గాధలు, పద్యాలు, పాటలు కోకొల్లలుగా ఉన్నాయి. కేవలం మన తెలుగు భాష లోనే కాక  భాషా వైవిధ్యం గల   భారతీయ సాహిత్యములో పండుగలకు ఉన్న ఘనత, యావత్ సమాజాన్ని  ఎంత గానో ప్రభావితం చేసింది. అంతేకాదు సాహిత్యం సుసంపన్న అయింది. ఇక్కడ మనకు భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది.
మన తెలుగు ప్రాంతాలలో శ్రీరామనవమి, ఉగాది, సంక్రాంతి వంటి పెక్కు పండుగలకు సంబంధించి పురాణ గాధలు, జానపద గీతాలు పాటలు పద్యాలు చోటుచేసుకున్నాయి.
      కాని దసరా పండగ కేవలం పెద్దల పండగని గాక   మరో ప్రత్యేకత ఉంది.పిల్లల పండుగని వర్ధిల్లింది.
ఈ పండుగకు తెలుగు బాలసాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంది.గత కొన్నేళ్ల   కిందటి వరకు ఆంధ్రదేశంలో వాడవాడల బాలల పండగని, విశ్వసించే పరిస్థితులు ఉండేవి.
    మహాలయ అమావాస్య అనగా భాద్రపద అమావాస్య తదుపరి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రాథమిక పాఠశాలలో పూజప్రారంభ మయ్యేది. పాఠశాలలోఉపాధ్యాయులు సరస్వతి చిత్ర పటము ప్రతిష్ఠించేవారు.బాలలు, తాము తెచ్చిన ఫల పుష్పాదులతో గురువులు పూజా కార్యక్రమం నిర్వహీంచే వారు.అది విజయ దశమి పర్వదిన ఆరంభ సూచకం.
    బాలలందరి చేతిలో కొయ్య బాణాలు, ఈ బాణాలు, రంగు కాగితాలతో అలంకరింపబడినవే. బాలలు వీటిని ధరించి దసరా పద్యాలు, పాటలు, 
పాడుతూ ఇంటింటికి తిరిగే సాంప్రదాయమానాడు తెలుగునాట ఉండేది.
 ఉపాధ్యాయులు పిల్లలతో కలసి ప్రతి ఇంటికి వెళ్లే వారు. ఇంట వాకిట నిలబడి, పిల్లలు మొదట విఘ్నేశ్వరునిపై పాట పాడుతూ ప్రారంభించేవారు.
                విఘ్నేశ్వర ప్రార్ధనా గీతం
శ్రీ పార్వతీ పుత్ర శృంగార గాత్ర/పాప కానన దాన
భవ రోగ హరణ/నీకు మ్రొక్కెదమయ్య నిగ
మాంత వేద్య/గుజ్జ రూపుడ నిన్ను కోరి భజియింతు/ విద్యలకు గురుడవు విఘ్నేశ నీవు/బుద్ధిని నిలుపుము మాకు భోగేశ భూష/శ్రీ గణనాయక శ్రిత పారిజాత నాగేంద్ర భూషణ నవ మణి హార/
పార్వతి సత్పుత్ర భవ్య చారిత్ర గీర్వాణ వినుత/
సత్కీర్తి  విస్తార, దేవేంద్ర వందిత దీనమందార/
పావన నామమౌ పాహి విఘ్నేశ//జయ జయా
జయ జయా జై మహా విజయ://
 దసరా పండుగ - బాల సాహిత్యం సంబంధించిన ఆనాడు బాలలు పాడే మరికొన్ని ఇంపైన సొంపైన పాటలు.....
   (సశేషం)