తెలుగు భాష--రావిపల్లి వాసుదేవరావు-పార్వతీపురం 9441713136.

తెలుగు భాషకు సాటిలేదురా ఇలలోన
తెలుగు భాషకు దీటులేదురా ఎపుడైన
తెలుగు వెలుగును పంచునురా ఎచటైన
తెలుగు మమతను పెంచునురా మనలోన


తెలుగు దీప్తి వెలిగించవలెనురా ఎదలోన
తెలుగు కీర్తిని పెంచవలెనుర ఇకనైన
తెలుగు స్ఫూర్తిని నింపవలెనురా ఎక్కడైన
తెలుగు తేజము నిండవలెనురా మనలోన


తెలుగే మంత్రం కావలెనురా ఇకపైన
తెలుగు అందలం ఎక్కవలెనురా ఇపుడైన
తెలుగు సంబరం చేయవలెనురా అంబరాన
తెలుగు భావనను వ్యాప్తిచేయరా ఎద ఎద న


తెలుగు గాధలు వినిపించుమురా రమ్యముగా
తెలుగు పద్యములు నేర్పించుమురా అందముగా
తెలుగు కీర్తనలు ఆలపించుమురా హాయిగా
తెలుగు గేయములు పాడుమురా మధురంగా


తెలుగు అణువణువు నిండవలెనురా మదిలోన
తెలుగు తంత్రులు మీటవలెనురా హృదయాన
తెలుగు తోరణం కట్టవలెనురా ఈ జగాన
తెలుగు ఆకాంక్ష నెరవేర్చుము అందరిలోన