పలుకరింపు --చెన్నమనేని ప్రేమసాగర్ రావు

పలుకరింపే చాలు 
పదివేల వరహాలు 
నూతిలో పడ్డోడు 
నిబ్బరంగుంటాడు 
ఆదుకుంటాడని 
ఆశతో వుంటాడు 
జనంలో వెల్తుంటె
మందలిస్తే చాలు 
మనవాడు అని తలపు 
కుశలమడిగినచాలు
శ్రేయోభిలాషి ఒకడున్నాడని 
మదిలోన సంతృప్తి 
ఏదేశమేగినా 
మనవాడు కనబడుతే 
గర్వమెంతో కలుగు 
దేశ ఉన్నతి తలచి 
పలుకరింపే చాలు 
పరవశమెంతో కలుగు