‘‘బిరుదులు, అవార్డులు, సత్కారాలు, పారితోషికాలు, శాలువాలు, పతాక శీర్షికలు వ్యక్తి కీర్తిని నలుదిశలా చాటే వాహకాలు’ అన్నాను.
‘‘అట్లనా’’ అన్నడు వెటకారంగా బుంగి
‘‘ఎందుకా వెటకారం’’ కోపంగా అన్నాను.
‘‘వాటి వెనక పడితే కలిగే తిప్పలు తెలుసు. అలాంటి వారి గురించి తెలుసునాకు’’
‘‘ఆ మతలబేంటో చెప’’
ఒక రోజు సభకు అతిథిగా ఆహ్వానం అందింది. ఆనాడు వేదిక నిండింది. సభ వెలవెల బోయింది. హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నాయి. శ్రోతలు లేరు. నాకు ఆశ్చర్యమని పించింది. గతవారం ఇదే హాల్‌లో ఇలాంటి సభే జరిగింది. అది విజయవంతమయింది. ఇది కాలేదు. కారణమేంటని నిర్వాహకుల నడిగిన అన్నీ తెచ్చుకున్నట్లే శ్రోతలను సమకూర్చుకోవాలి అని జవాబిచ్చిండు.
‘‘ఆనాటి సభలో సాహితీ జీవులు లేరా’’
‘‘ఒకరిద్దరు వారుంటే ఐదుగురు సొంత జీవులు, రచయిత సొంత బలగంతో ఆనాటి హాల్‌పొంగింది’’
‘‘అలాంటి సమావేశం జరపడం అవసరమా’’
‘‘అలాంటి సభవల్లనే పతాక శీర్షికలు లభిస్తాయి. కీర్తి చంద్రికలు నలుదిక్కులా వ్యాప్తి చెందుతయి. వాటిని చూపి అవార్డులు, సత్కారాలు, లాంటి వాటిని అందుకోవచ్చు. ఇలా చాలా సార్లు జరిగితే అనుయాయులు గుమికూడుతరు. వారితో కలిసి పీఠం ఏర్పాటు అయితది. అక్కడినుండి సాహిత్య నాయకత్వం చేతులోకి వస్తది. అలా సాహిత్యకీయాలు కొనసాగించవచ్చు’’
‘‘సరే ఇపడైతే సమయం ప్రకారం సభ జరపండి’’
‘‘ఇలాంటి సభల్లో సమయపాలన కష్టం సార్’’
‘‘ఇగ మాట్లాడటం రీతి కాదు. అని ఊరుకున్న’’ అంటూ ముగించిండు బుంగి.
నిండు నదులు పారు నిల్చి గంభీరమై
వెర్రివాగు పారు వేగ బొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ వినుర వేమ
వేమన శతకం
వేమన
రీతి: - డాక్టర్. బి. వి. ఎన్ . స్వామి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి