పంట పొలాల మీది పచ్చని చెమట
చేనుగట్టు లోన ఆశల మొలక
అక్షర సుగంధo అంట కున్నా కాల స్వభావాలెరిగిన మర్మజ్ఞత !
అన్నదాత సుఖీభవను
అనుభవించ లేని తలరాత
చేతులు
బొబ్బలెక్కినా
అడుసులో కూరుకుపోయినా
కుంగి పోనీ ఆత్మనిర్భరత
ఏవుసం తప్ప మోసం తెలియని
చిత్తం
నకిలీల విత్తనపు మోసాల్లో
చిత్తయి పోయే కాయం!
పత్రాలతోనే హరిత భాషణ పూవులతోనే
వూసులు కాయలు పండ్లతోనే పరాచికాలు
జీవితమంతా సస్యరక్షణ లొనే పరి భ్రమణం
పెట్టుబడుల
విపణి వీధిలో వడ్డీ కట్టలేక
కాల పరీక్షలో
తూకాల లెక్కలు తెలియనీ బేల
ఆరుగాలం శ్రమించి అమ్మడానికి పోతే మద్దత్తు ధర పలకక
బతుకు భారమైన సన్నకారు రైతన్న
భూమిని నమ్మిన వాడేవడు చెడిపోడు !
పంట నిచ్చి ఆదర్వుతో ఆదుకునే వసుధారాణి కన్న మిన్న లేదు
ముళ్ల మీద నడుస్తూ వానలో తడుస్తూ రాత్రి పగలు అరకను నమ్మి శ్రమియించే తారక కర్షకునికి పదవీ విరమణ లేదు
అన్నపురాసుల మిన్నగ పోసి
ఆకలి పురుగుల నుసి చేసి
శాంతిని పంచే రైతేరాజు ను
జై కిసాన్ శుష్క నినాదాలు కాదు మట్టి సాక్షిగా
పైకి తెచ్చే పచ్చని ప్రయత్నాలు ఆరంభం కావాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి