తాతయ్య సాహిత్యాన్ని చదవడంలోనూ,విశాల ప్రకృతిలో నుంచి కథా వస్తువులను ఏరుకొని కావ్యాలు రచించడంలోను, సిద్ధహస్తుడని,సంధ్యా గీతాలు ప్రచురింంపబడ్డ తరువాత తెలిసింది.అదే సమయంలో వాల్మీకి ప్రతిభ అనే డాన్స్ డ్రామా రాసి తాతయ్య స్వయంగా వాల్మీకి పాత్ర పోషించాడు.ఈ నాటకం లో వాల్మీకి దారి దోపిడీ దొంగ.అతనికి ఒకరోజు సరస్వతి ప్రత్యక్షమై విద్య నిచ్చి, సంస్కృత భాషలో రామాయణాన్ని రాయమని చెప్పింది.
ఈ డ్రామాలో నృత్యం,గానం, సంగీతం, చాలా ఆకర్షణీయంగా కూర్చబడ్డాయి.సంగీతంలో బెంగాలీ తరహా సంగీతంతో పాటు, తాను ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు నేర్చుకున్న సంగీతాన్ని కలిపి సరికొత్త రాగాలను తయారు చేసారు.
ఈ విధంగా తాతయ్య సాహిత్యంలోను,సంగీతంలోను, జీవితాంతం ప్రయోగాలు సాగిస్తూనేవున్నాడు.
తాతయ్య తన 22 వ ఏట బెంగాలీ భాషలో, ప్రకృతి ప్రతిశోధన అనే డ్రామా రాసినాడు.దానినే సన్యాసి అనే పేరుతో ఇంగ్లీషు లోకి అనువాదం చేసారు.ఈ నాటకంలో ఒక సన్యాసి ప్రపంచ విషయాలు అన్నీ వదులుకొని నేను కోర్కెలను చెప్పుకున్నాను.నాకు ప్రపంచంలో ఎటువంటి కోర్కె లేదని గొప్పలు చెప్పుకుంటాడు.మిగితాది రేపు.....
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి