మనిషి ఆయువు--- యామిజాల జగదీశ్

ఒకరోజు బుద్ధుడు శిష్యుల ముందు ఓ ప్రశ్నుంచాడు. 


మనిషి ఆయువు ఎంత కాలం? అన్నదే ఆ ప్రశ్న.


ఒక శిష్యుడు మనిషి ఆయువు డెబ్బయ్ ఏళ్ళు అని జవాబిచ్చాడు.


బుద్ధుడు  కాదూ అన్నాడు.


అతను ఎక్కువ సంవత్సరాలు చెప్పాడేమో అనుకుని మరొకడు అరవై ఏళ్ళన్నాడు.


అదీ కాదన్నాడు.


మరొక శిష్యుడు యాభై ఏళ్ళన్నాడు.


అదీ సరికాదన్నాడు.


ఏంటీ మనిషి ఆయువు యాభై ఏళ్ళు కూడా కాదా అని బుద్ధుడ్ని అడిగారు.


అప్పుడు బుద్ధుడు "మీరు చెప్పినవేవీ సరికావు. నిజం చెప్పాలంటే శ్వాస తీసి శ్వాస విడిచే ఆ క్షణకాలమే ఆయువు" అన్నాడు.


అంటే వర్తమానమే ఆయువన్న మాట. ఇప్పుడీ క్షణంలో ఉన్న క్షణమే ఆయువనుకోవాలి. గతాన్ని ఎలాగైతే తీసుకురాలేమో భవిష్యత్తునీ లెక్కించలేం. ఉన్న క్షణాన్ని ఆనందంగా గడపడమే జీవితం. అంతేతప్ప ఏవేవో అనుకుంటూ తవ్వుకుంటూ సంతోషాన్ని దూరం చేసుకోవడమో లేక బాధ పడటమో సరికాదు.



కామెంట్‌లు