నీరు --కన్నీరు ..!!---డా .కె.ఎల్ .వి.ప్రసాద్ ,హనంకొండ ,వరంగల్ .

నీరూ ..నీరూ ..
ఏమి నీరూ ...
విందుతో 
కనిపించేదీ 
తేనీరూ ...!


నీరూ ..నీరూ ..
ఏమి నీరూ ...
సువాసన కోసం 
పన్నీరు ....!


నీరూ...నీరూ..
ఏమినీరూ..
శక్తిని పెంచే
కమ్మని-
కొబ్బరి నీరు..!


 నీరూ..నీరూ ..
ఏమి నీరూ ..
దాహం కోసం
మంచి నీరు..!


నీరూ ..నీరూ ..
ఏమి నీరూ ..
దుఃఖానికి 
సంకేతం ...
కన్నీరు ....!