తను:- డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి

బుంగి నా చేతికి ఒక ఉత్తరం ఇచ్చి చదవమన్నడు. అది ఇలా ఉంది.
‘‘....చెప్పేదేముందే. ఈ మధ్య నాకు పానం మంచిగ ఉంటలేదు. దమ్ము, దగ్గు ముదిరినయి. మగ్గం నేసెటోల్లకు ఉల్లి తోటి శ్వాస సంబంధమైన దమ్ము, దగ్గు వస్తది. అది ముదిరి టీబీకి దారి చూపుతదట. గుట్టకిందోనికి గిట్లనే అయింది. నా సంగతి కూడా గట్లనే అయెతట్టుంది. డాక్టరు కూడా చెప్పిండు. ఇల్లమ్మిన పైసలు అయిపోయినయి. పెద్ద పొల్లకు కుదిరిన సంబంధం కట్నం కాడ ఎత్తిపాయె. ఇగనేను సంపాయించుడు కల్ల. నేను బతికుంటె మీకు భారం అవుడే తప్ప ఇంకోటి లేదు. నేను నైట్రేట్ సోడా తాగి సచ్చిపోతున్న. నా చావుకు ఎవరు బాద్యులు కాదు
నా సావుకు దయతలచి, సర్కారు ఇచ్చే పైసలతోటి పెద్దపొల్ల లగ్గం చెయ్యి. మీ అందరికి అన్యాయం చేత్తున్న అని తెలుసు కాని బతికుంటే ఇంతకంటె ఎక్కువ అన్యాయం అయితం మనసోంటి నేత కార్మికులకు వచ్చేది కట్టగాలం. బతుకుడు కట్టం. మధ్యల వచ్చినోన్ని మద్యలనే పోతున్న, నన్ను మన్నించు.’’
‘‘ఇది ఎవరు, ఎవరికి రాసిండ్రు’’
‘‘తను భార్యకు రాసిండు’’
‘‘ఇట్ల చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నరు’’
‘‘తాడే పామై కరవడం అంటే ఇదే’’
‘‘అదెట్ల’’
‘‘నూలుపోగే ఉరిపోగౌతుంది’’ అంటూ నిట్టూర్చిండు బుంగి.
తనకంటె బేదవాండ్రం
గని యంతకు దనకుమేలు గాయనవలయున్
దనకంటె భాగ్యవంతుల
గని గుటకలు మ్రింగ మేలు గాదు కుమారీ
కుమారీ శతకం
పక్కి లక్ష్మీనరసింహ కవి